కరోనా టెస్టుల విషయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు

కోవిడ్‌ 19 నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా నిర్వహించాల్సిందే అంటూ గత వారం ఒక పిటీషన్‌ను విచారించిన సందర్బంగా సుప్రీం కోర్టు కేంద్రంకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే.అయితే తాజాగా ఆ నిర్ణయాన్ని సవరించింది.

 Supreme Court Key Announcement About Corona Virus Test, India Lock Down, Supreme-TeluguStop.com

సుప్రీం కోర్టు తాజాగా తన నిర్ణయాన్ని సరిదిద్దుకుంటున్నట్లుగా ప్రకటించింది.కరోనా వైరస్‌ టెస్టు కేవలం పేదవారికి మాత్రమే ఉచితంగా చేయాలని, అందరికి ఉచితంగా చేయాల్సిన అవసరం లేదంటూ పేర్కొంది.

ఈ సమయంలో ప్రభుత్వం ఆర్థికంగా సంక్షోభంలో ఉంది.కనుక డబ్బు ఉన్న వారికి ఈ పరీక్షలు ఉచితంగా చేయాల్సిన అవసరం లేదని, డబ్బులు వసూళ్ళు చేయవచ్చు అంటూ ప్రభుత్వంకు సూచించింది.

ఆర్థిక పరమైన ఇబ్బందులున్న ఈ సమయంలో కరోనా వైరస్‌ నిర్ధారణకు ప్రభుత్వాలు వందల కోట్లను ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తున్న కారణంగా సుప్రీం కోర్టు ఈ నిర్ణయంను వెళ్లడి చేసినట్లుగా సమాచారం అందుతోంది.సుప్రీం తీర్పును ప్రభుత్వ వర్గాల వారు ఇంకా ప్రముఖులు సమర్ధిస్తున్నారు.

ఆరోగ్య భద్రత కార్డు లేదంటే మరేదైనా ప్రభుత్వం దిగువమద్యతరగతి వారు అంటూ గుర్తించిన కార్డులు ఉన్న వారికి ఈ పరీక్షలు ఉచితంగా చేయబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube