మాజీ చీఫ్ జస్టిస్ పై దాఖలైన పిటీషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు!

భారత మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ను ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.ఆయన సీజేఐ గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటూ 2018 లో ఆయనపై పిటీషన్ దాఖలు అవ్వగా, నేడు సుప్రీం ధర్మాసనం ఈ రోజు విచారించి ఆ పిటీషన్ ను కొట్టేసింది.

 Supreme Court Dismisses Plea Seeking Inquiry Against Former Cji Ranjan Gogoi, Su-TeluguStop.com

అయితే ఈ పిటీషన్ దాఖలు రెండేళ్లు అయినా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దాన్ని ఇంత వరకు ధర్మాసనం ముందుకు పెట్టలేదని, పలుమార్లు ఆయనకు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది అంటూ తాజాగా పిటిషనర్ ఆరోపించారు. జస్టిస్ గొగోయ్ 2016 జూలైలో ప్రతివాదులకు తెలియకుండా పక్షపాతంగా, అక్రమంగా తీర్పు వెలువరించారనీ… దీనిపై ఓ న్యాయమూర్తుల కమిటీ వేసి అంతర్గత విచారణ చేపట్టాలని సదరు పిటిషనర్ డిమాండ్ చేశారు.

అయితే పిటీషనర్ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇప్పటికే జస్టిస్ గొగోయ్ పదవీ విరమణ చేసినందున దీనిపై విచారణ చేపట్టడం వల్ల ప్రయోజనం లేదని సర్వోన్నత ధర్మాసనం పేర్కొంది.

ఆయన పదవీ విరమణ చేసినందున ఇప్పుడు ఈ పిటీషన్ పై విచారణ చేపట్టడం తో ఎలాంటి ప్రయోజనం ఉండబోదని వ్యాఖ్యానించిన సుప్రీం ధర్మాసనం ఈ పిటీషన్ ను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube