దేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో సోషల్ మీడియాలో కొన్ని వెబ్ పోర్టల్స్..
చానల్స్ జవాబుదారితనం లేకుండా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మండిపడ్డారు.దేశంలో ప్రతి విషయానికి మతం రంగు పులుముకుని వార్తలు క్రియేట్ చేస్తున్నారని దీనివల్ల దేశానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు.
తబ్లిక్ కి జమాత్ మీటింగ్ కారణంగానే దేశంలో కరోనా వ్యాప్తి చెందినట్లు ఓ వర్గం మీడియా ప్రసారాలపై సుప్రీంకోర్టులో రీట్ పిటిషన్ దాఖలు అయ్యాయి.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.న్యాయ వ్యవస్థ అని లేదా న్యాయ మూర్తులు అని గౌరవం కూడా లేకుండా అసత్య వార్తలు రాసుకుంటూ పోతున్నారని.బలవంతపు మాటలు విని జడ్జీలు.
సంస్థలు.సామాన్యులు అని పట్టింపు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సోషల్ మీడియా ని కట్టడి చేసే ఎటువంటి వ్యవస్థ ఉందో.? కేంద్రం తెలియజేయాలని స్పష్టం చేశారు.సోషల్ మీడియా సంస్థలు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.సోషల్ మీడియా పై నియంత్రణ లేకపోవడం వల్ల వ్యక్తులకు అదేరీతిలో వ్యవస్థలకు పరువునష్టం ప్రస్తుత రోజుల్లో కలుగుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సీరియస్ అయ్యారు.