రేప్ కేసు నిందితుడికి చెమటలు పట్టించిన సుప్రీం కోర్టు ప్ర‌శ్న.. ?

నేడు సమాజంలో మహిళల పై అత్యాచారాలు ఎక్కువగా అవుతున్న విషయం తెలిసిందే.అయితే ఇలాగే స్కూల్ విద్యార్థిని రేప్ చేసిన ఒక ప్రబుద్దుడికి సుప్రీంకోర్టు చెమటలు పట్టించింది.

 Supreme Court Asked Government Worker In Rape Case Maharashtra, Electricity Depa-TeluguStop.com

ఆ వివరాలు తెలుసుకుంటే.మ‌హారాష్ట్ర విద్యుత్తు శాఖ‌కు చెందిన ఉద్యోగి, మోహిత్ సుభాష్ చ‌వాన్ త‌న మీద న‌మోదు అయిన‌ రేప్ కేసులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

కాగా ఈరోజు సుప్రీం కోర్టులో, సీజే ఎస్ఏ బోబ్డే, ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా తీర్పునిస్తూ, అత్యాచారం చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఈ కేసులో మీకూ హెల్ప్ చేస్తాం, లేదంటే నువ్వు నీ ఉద్యోగం కోల్పోవడమే కాదు, జైలు శిక్ష కూడా అనుభవించవలసి వస్తుందని తీవ్రంగా మందలించారు.దీనికి మోహిత్ సుభాష్ సమాధానంగా త‌న‌కు మ‌రో పెళ్లి జ‌రిగింద‌ని, అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేన‌న్నాడట.

ఇక నువ్వు ఒక గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగి అన్న ధ్యాస కూడా లేకుండా స్కూల్ విద్యార్థిని రేప్ చేసిన నీకు శిక్ష తప్పక పడవలసిందే అని జడ్జి అనడంతో, అరెస్టుకు గురైతే, తన ఉద్యోగం పోతుంద‌ని ఆ నిందితుడు కోర్టుకు తెలిపారు.కాగా నాలుగు వారాల వ‌ర‌కు ఈ అరెస్టును నిలిపివేస్తున్నామ‌ని, సరైన నిర్ణయం తీసుకోవాలని సీజే త‌న ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇకపోతే రేప్‌కు గురైన అమ్మాయిని తొలుత నిందితుడి పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడట, కానీ అప్పుడు ఆమె నిరాక‌రించడంతో కధ ఇంతవరకు వచ్చిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube