కొడుకు కోసం ఎన్ఆర్ఐ తండ్రి పోరాటం: న్యాయం చేసిన సుప్రీంకోర్టు

భారత్‌లో తల్లి వద్ద వుంటున్న నాలుగేళ్ల చిన్నారిని అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ తండ్రికి అప్పగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.ప్రభుజిత్ జౌహర్ అనే న్యాయవాది దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందూ మల్హోత్రా, కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

 Supreme Court Allows Father To Take Four-year-old Son Back To Us, Supreme Court,-TeluguStop.com

ఒకవేళ తల్లిగనుక అమెరికా వెళ్లాలనుకుంటే తన క్లయింట్.నివాసానికి దగ్గరలోనే ప్రత్యేక వసతి కల్పిస్తారని జౌహర్ కోర్టుకు తెలియజేశారు.

సుప్రీంకోర్టుతో పాటు అమెరికా కోర్టు గతేడాది తండ్రికి పిల్లవాడిని అప్పగించింది.భార్యాభర్తలు విడిపోవడంతో తల్లి కనుక అమెరికా రాకపోతే, ఆన్‌లైన్ ద్వారా వారానికి కనీసం మూడు సార్లు ఆమెకు చూపిస్తాడని జౌహర్ వెల్లడించారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం పిల్లవాడిని న్యూజెర్సీ తీసుకెళ్లేందు అనుమతించింది.ఇదే సమయంలో కొన్ని రోజులు భారత్‌లో ఉంటానని చెప్పి బిడ్డను తీసుకొచ్చిన భార్య తీరును ధర్మాసనం తప్పుబట్టింది.

భారత్- న్యూజెర్సీలలో కోవిడ్ ఫ్రీగా మారిన తర్వాత మాత్రమే ప్రయాణం చేయాల్సిందిగా ఆదేశించింది.

కాగా ఈ జంటకు 2012లో వివాహం జరిగింది.ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి 2015లో అమెరికాకు వెళ్లారు.2019 మార్చిలో అతని భార్య బిడ్డతో కలిసి కొద్దిరోజుల పాటు భారతదేశానికి వెళ్తానని భర్తకు చెప్పింది.కానీ ఇండియాకు వచ్చిన తర్వాత తాను బాబుతో కలిసి ఇక్కడే ఉంటానని తేల్చి చెప్పింది.

దీంతో ఆయన ఏప్రిల్ 13, 2019న బెంగళూరు వచ్చి భార్యను కలుసుకున్నాడు.

తమ వివాహ బంధంలో చోటు చేసుకున్న మనస్పర్థల నేపథ్యంలో ఆయన పరిష్కారాన్ని అన్వేషించారు.అలాగే అమెరికాకు తిరిగి రావాల్సిందిగా ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

అయితే ఏప్రిల్ 16, 2019న ఆయన కుమారుడిని తనకు అప్పగించాల్సిందిగా సుపీయర్ కోర్ట్ ఆఫ్ న్యూజెర్సీ, హడ్సన్ కౌంటీ, చాన్సరీ డివిజన్ ఫ్యామిలీ పార్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో మే 21, 2019న న్యూజెర్సీ సుపీరియర్ కోర్ట్ తండ్రికే కుమారుడి చట్టపరమైన బాధ్యత ఉందని చెబుతూ తాత్కాలిక కస్టడీని మంజూరు చేసింది.

ఈ తీర్పు వచ్చిన రెండు వారాల తర్వాత న్యూజెర్సీలోని కోర్టులో ఆయన విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube