సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ కీలక వ్యాఖ్యలు..!!

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.

 Suprem Court Chief Justice Nv Ramana Sensational Comments, Nv Ramana, Supreme Co-TeluguStop.com

రమణ సంచలన కామెంట్స్ చేశారు.సమాజంలో వేగంగా మారుతున్న మౌలిక వసతులు మెరుగు పరచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

ఆధునిక వసతులతో కోర్టు సముదాయాలు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ సృష్టిస్తున్న పరిస్థితులను తట్టుకుని.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిజిటలైజేషన్  విషయంలో న్యాయ వ్యవస్థ మెరుగైన రీతిలో రాణించాలని తెలిపారు.న్యాయస్థానంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు.

పై కోర్టులు కిందిస్థాయి కోర్టుల పనితీరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇటీవల సమీక్షించిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ మెరుగైన సేవలు అందించాలంటే కచ్చితంగా మౌలిక వసతులు మెరుగుపరచుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.ఇటీవల దేశవ్యాప్తంగా న్యాయస్థానాల పనితీరును సమీక్షించిన ఎన్.వి.రమణ అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల తో మాట్లాడటం జరిగింది.సంక్షోభ సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు చేసిన పని తీరు పట్ల ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.అదేవిధంగా కరోనా నేపథ్యంలో న్యాయవ్యవస్థలో చనిపోయిన న్యాయమూర్తులకు అధికారులకు నివాళులు అర్పించారు.

ప్రస్తుత పరిస్థితుల బట్టి ఆధునిక వసతులతో కోర్టు సముదాయాలు నిర్మించాల్సిన అవసరం ఉంది అంటూ నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎన్.వి.రమణ తెలియజేశారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube