నన్నొదిలేయండి ..ప్లీజ్ అంటూ యువతి అభ్యర్ధన... ముఖ్యమంత్రి హామి..

సోషల్ మీడియా ఇదంతా ఒక మాయా ప్రపంచం.ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎలా వైరలవుతారో.

 Support Pours In From All Sides For Kerala College Student Hanan Hamid-TeluguStop.com

అయ్యేవరకు వారికే తెలీదు.సోషల్ మీడియా తలుచుకుంటే రాత్రికి రాత్రి ఎవర్నైనా స్టార్ ని చేయగలదు.

లేదంటే అంతే స్థాయిలో నెగటివ్ పబ్లిసిటిని ఇవ్వగలదు.అలా నిండా పాతికేళ్లు నిండని యువతి జీవితాన్ని సోషల్ మీడియా ఎలా మార్చిందో తెలుసా.

కేరళలోని మదవనాలో నివసిస్తున్న హనన్ హమీద్ అనే యువతి.తొడుపుజాలోని అల్ అజహర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో మూడో సంవత్సరం చదువుతోంది.

తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో కుటుంబ బాద్యతను తనపైన వేసుకున్న హసన్ ప్రతిరోజు కాలేజ్ తర్వాత కోచి వెళ్లి రాత్రి 9 గంటల వరకు చేపలను అమ్ముతుంది.అంతేకాదు డబ్బింగ్, జూనియర్ ఆర్టిస్టుగా కూడా పనిచేస్తుంది.

ఇవే విషయాలను వివరిస్తూ ఓ ప్రముఖ మలయాళ పత్రిక హసన్ గురించి ఓ కథనాన్ని ప్రచురించింది.హసన్ గురించి ప్రచురితమైన ఆ కథనం మలయాళీ సినీ పరిశ్రమ, రాజకీయ నేతలను కూడా కదిలించింది.

దాంతో అరుణ్ గోపీ అనే నిర్మాత మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్‌తో తీసే చిత్రంలో ఆమెకు అవకాశం ఇస్తామని కూడా ప్రకటించారు.

నన్నొదిలేయండి .ప్లీజ్.

ఇదిలా ఉంటే మరోవైపు కొన్నివర్గాలు ఆమె చేపలను విక్రయిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టి.తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు.అదంతా ఒక డ్రామా అని కొందరు, చేపలు అమ్ముకునేవారు అలా స్టైల్‌గా, అందంగా మేకప్ చేసుకుని ఉంటారా? అని మరికొందరు ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు.మరికొందరు ఏకంగా మతం రంగు పులిమారు.అంతటితో ఆగకుండా ఆమె చేపలు విక్రయించే ప్రాంతానికి వెళ్లి ఆమెను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.

చివరికి ఆమె దండం పెట్టి ‘‘ప్లీజ్ నన్ను వదిలేయండి.నా బతుకు నేను బతుకుతా’’ అని ప్రాదేయపడేవరకూ వెళ్లింది.

ముఖ్యమంత్రి హామి

దాంతో స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ రంగంలోకి దిగి ఆమెకు మద్దతు తెలుపుతూ.‘‘ఆమెను చూస్తే గర్వంగా ఉంది.

జీవితంలో కష్టాలకు వెనకడుగు వేయకుండా కష్టపడి పనిచేస్తుంది.సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా వస్తున్న దూషణలకు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని ఆమెను కోరుతున్నా.

కేరళా ప్రజలంతా ఆమెకు అండగా ఉండాలి.సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి.

దాన్ని ఎలా వాడాలనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’’ అని తెలిపుతూ .కేరళ రాష్ట్ర ప్రభుత్వం తనకు పూర్తి రక్షణ కల్పిస్తుందని హామి ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube