ఈటెల కే సబ్బండ వర్గాల మద్దతు -జాజుల శ్రీనివాస్ గౌడ్

హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ కి సబ్బండ వర్గాల మద్దతు ఉంటుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలంగాణ ఓయూ జేఏసీ, గిరిజన జేఏసీ నాయకులతో కలిసి మాట్లాడారు.

 Support Of Etala K Sabbanda Communities -jajula Srinivas Goud, Jajula Srinivas-TeluguStop.com

ఈటల రాజేందర్ వల్లే రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయని అన్నారు.ప్రస్తుతం దళిత బంధు పథకం కూడా ఈటల రాజేందర్ పుణ్యమే అని అన్నారు.2023 ఎన్నికలకు హుజరాబాద్ ఉప ఎన్నిక సెమీ ఫైనల్ అని అన్నారు.రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యమై టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

‌ మరో 20 ఏళ్లు తానే సీఎం అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలు కళ్లు తెరవాలని అన్నారు.హుజరాబాద్ లోని ఓటర్లు ధర్మం న్యాయం వైపు ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కృష్ణ నాయక్ నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube