చైనా యాప్స్ పై భారత్ నిషేధాన్ని సమర్ధించిన అమెరికా  

Support in US for India, banning TikTok, Chinese apps, Indian Government, America, Social Media, China - Telugu America, Banning Tiktok, China, Chinese Apps, Indian Government, Social Media, Support In Us For India

దేశ రక్షణ, అంతర్ఘత ప్రజా భద్రతని దృష్టిలో ఉంచుకొని చైనాకి చెందిన 59 యాప్స్ ని భారత్ ప్రభుత్వం నిషేధించింది.ఇందులో భారత్ లో భాగా పాపులర్ అయిన టిక్ టాక్, హలో వంటి యాప్స్ కూడా ఉన్నాయి.

 Support In Us For India Banning Tiktok And Other Chinese Apps

అయితే ఈ యాప్స్ ద్వారా ప్రజలకి సంబంధించిన సమాచార తస్కరణ జరుగుతుందని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంతో చైనా వ్యాపార సంస్థలు భారత్ నుంచి వందల కోట్ల రూపాయిలు నష్టపోవాల్సి వస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే భారతీయులు అందరూ చైనా యాప్స్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

చైనా యాప్స్ పై భారత్ నిషేధాన్ని సమర్ధించిన అమెరికా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక చైనా యాప్స్​ను నిషేధిస్తూ భారత్​ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో స్వాగతించారు.

ఈ నిర్ణయంతో భారత సమగ్రత, దేశ జాతీయ భద్రత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే ఇప్పుడు భారత్ దారిలోనే అమెరికా కూడా చైనాకి చెందిన యాప్స్ ని నిషేధించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

అదే జరిగితే చైనా ప్రభుత్వం కూడా అమెరికాకి చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లని నిషేధించే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి ఇండియా దారిలో చైనా యాప్స్ విషయంలో ఎన్ని దేశాలు ధైర్యంగా నిషేధం దిశగా ముందడుగు వేస్తాయనేది చూడాలి.

#America #Banning TikTok #Chinese Apps #Social Media #China

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Support In Us For India Banning Tiktok And Other Chinese Apps Related Telugu News,Photos/Pics,Images..