ఈట‌ల‌కు వెల్లువెత్తుతున్న మ‌ద్ద‌తు.. ఇప్పుడు మ‌రో పార్టీ సీనియ‌ర్‌నేత‌..!

అన్ని రాజ‌కీయ పార్టీల్లో మంచి సంబంధాలు ఉన్న నేత‌గా ఈట‌ల రాజేంద‌ర్‌కు పేరుంది.ఆయ‌న మొద‌టి నుంచి కూడా చాలామంది మ‌ద్ద‌తుతోనే రాజ‌కీయాలు చేశారు.

 Support Flowing To Eeta Now Another Party Senior Leader-TeluguStop.com

ఆయ‌న్ను విమ‌ర్శించేందుకు కూడా ఇత‌ర పార్టీల నేత‌లు ఒక అడుగు వెన‌క్కు వేస్తారంటే ఆయ‌న ఎంత మృధుశాలో అర్థం చేసుకోవ‌చ్చు.అందుకే ఆయ‌న్ను సీఎం కేసీఆర్ బ‌ర్త‌ర‌ఫ్ చేసిన వెంట‌నే అన్ని పార్టీల నుంచి మ‌ద్ద‌తు వ‌చ్చింది.

ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇలా ఒక అధికార ప‌క్షానికి చెందిన వ్యక్తికి స‌పోర్టు చేయ‌డం ఇదే మొద‌టిసారి కావ‌చ్చు.అయితే ఇప్పుడు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల్లో కూడా అన్ని పార్టీల నుంచి ఈట‌ల‌కు మ‌ద్దతు వ‌స్తోంది.

 Support Flowing To Eeta Now Another Party Senior Leader-ఈట‌ల‌కు వెల్లువెత్తుతున్న మ‌ద్ద‌తు.. ఇప్పుడు మ‌రో పార్టీ సీనియ‌ర్‌నేత‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పుడు మ‌రో సీనియ‌ర్ నేత కూడా ఆయ‌న‌కు స‌పోర్టు ఇస్తున్నారు.ఆయ‌నెవ‌రో కాదు అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత అయితే గోనె ప్ర‌కాశ్ రావు త‌న జిల్లాకు చెందిన ఇన్ చార్జి మంత్రిపై కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

వాస్త‌వానికి నిర్మల్ పట్టణం మునుగుడులో ఆ మంత్రిదే బాధ్య‌త అని, ఆయ‌న అనుచ‌రులే న‌గ‌రంలోని చెరువుల్ని క‌బ్జా చేయ‌డంతో చెరువుల్లోకి వెళ్లాల్సిన వాన నీరు కాస్తా పట్టణాన్ని ముంచేశాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.ఇక ఇలాంటి మంత్రిపై చర్యలు తీసుకోవ‌డానికి ధైర్యం చాల‌న సీఎం కేసీఆర్ ఈట‌ల‌పై ఎందుకు తీసుకున్నార‌ని మండిప‌డ్డారు.

కావాల‌నే ఈటల రాజేంద‌ర్ మీద క‌క్ష పూరితంగా చర్యల కోసం పట్టుబ‌ట్టిన కేసీఆర్ ఇలాంటి భూ కబ్జా ఆరోపణలు ఉన్న మంత్రిపై ఎందుకు తీసుకోరని ప్ర‌శ్నించారు.మొత్తానికి కేసీఆర్ ఎన్ని ప‌థ‌కాలు పెట్టినా అవ‌న్నీ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి చేస్తున్నార‌ని, కానీ ఈట‌ల రాజేంద‌ర్‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతార‌ని వివ‌రించారు.హూజూరాబాద్ నుంచి ఆరుసార్లు పోటీ చేసిన ఈట‌ల‌కే త‌న మ‌ద్దతు ఉంటుంద‌ని, టీఆర్ ఎస్ కు కాద‌ని ఆయ‌న చెప్ప‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.మొత్తానికి ఈట‌ల రాజేంద‌ర్‌కు అన్ని పార్టీల నుంచి కూడా ఇలా మ‌ద్దతు రావ‌డం మంచిదే అని చెప్పాలి.

#Etala Rajender #Gonaprakash Rao #Huzurabad #Bjp #Trs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు