సూపర్ స్టార్ రజినీకాంత్( Superstar Rajinikanth ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రజినీకాంత్ ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో( Jailer movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ దాదాపు 600 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది.
ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు రజినీకాంత్.

ఇకపోతే తలైవ నెక్ట్స్ మూవీస్‌ను లైకా ప్రొడక్షన్స్ ( Lyca Productions )రూపొందిస్తున్న విషయం తెలిసిందే.అందులో లాల్ సలాం(Lal salaam ) కూడా ఒకటి.ఇందులో ఆయన కీలక పాత్రలో మాత్రమే నటించారు.
ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.ఇక ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న మరో భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
అదే తలైవర్ 170.ఇందులో రజినీకాంత్ తో పాటు పాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్స్ ఫహాద్ ఫాజిల్, మంజిమ వారియర్‌తో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి రానా దగ్గుబాటి( Rana ) నటించనున్నారు.తాజాగా తలైవర్ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేంటంటే తన 170వ చిత్రంలో రజినీకాంత్ కన్యాకుమారి స్లాంగ్‌లో మాట్లాడబోతున్నారట.ఇప్పటి వరకు ఆయన ఈ ప్రయత్నాన్ని చేయలేదు.ఆయన కెరీర్‌లోనే ఇలాంటి ప్రయత్నం చేయటం ఇదే తొలిసారి అవుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అలాగే ఆయన లుక్‌ను కూడా డైరెక్టర్ టి.జ్ఞానవేల్ ( Director T.Gnanavel )కొత్తగా ప్లాన్ చేస్తున్నారట.జై భీమ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ దర్శకుడు తెరకెక్కిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం.
కాగా రజినీకాంత్ తన 170వ సినిమాలో ఎన్‌కౌంటర్స్‌కు వ్యతిరేకంగా పోరాడే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లోకనిపించబోతున్నారట.త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారట.