తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.అయితే సూపర్ స్టార్ ఉన్నఫలంగా హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి కారణం ఏమిటని అభిమానులు ఒక్కసారిగా ఎంతో ఆందోళన చెందారు.
గత కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ తీవ్ర అనారోగ్య సమస్యతో చాలా రోజుల వరకు హాస్పిటల్ లో ఉంటూ చికిత్స చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో ముందుగా తాను ఒప్పుకున్న అన్నాతై సినిమా షూటింగు పూర్తి చేసుకున్నారు.
ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేసేలోగా మరోసారి సూపర్ స్టార్ హాస్పిటల్ పాలవడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రజనీకాంత్ హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ స్పందించారు.ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితి బాగుందని తనకు ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదని కేవలం జనరల్ చెకప్ కోసమే ఆస్పత్రికి వచ్చినట్లు అసలు విషయం బయట పెట్టారు.ఇలా రజనీ ఆరోగ్యం గురించి లతా అసలు విషయం చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.అలాగే రజనీకాంత్ ప్రధానపాత్రలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అన్నాతై ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న టైటిల్ తో నవంబర్ 4వ తేదీ దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.