సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ ఏప్రిల్ 23న విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట‘ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.సినిమా నుంచి బయటికి వస్తున్న కంటెంట్ కు వస్తున్న స్పందన అంచనాలని ఇంకా భారీగా పెంచుతుంది.

 Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Title Song To Be Out On April 23rd-TeluguStop.com

ఇప్పటికే సినిమాలోని మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి.మూడవ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు మూడో సింగల్ కి సంబధించిన అప్డేట్ కూడా వచ్చింది.

ఈ సినిమాలో మూడో పాట టైటిల్ సాంగ్ ను ఈ నెల 23న ఉదయం 11.07 కు విడుదల చేయనున్నారు.అదే పాట ట్యూన్ ని సినిమా టీజర్‌కి బీజీఎంగా కూడా ఉపయోగించడం మరో విశేషం.

మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ ఆల్బమ్ కోసం అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను కంపోజ్ చేశారు.ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్లపై ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారు.

ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అందిస్తున్నారు.రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ లో షూట్ చేస్తున్న ఈ పాట మాస్ సాంగ్ గా అలరించనుంది.

ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.ఇప్పటికే కళావతి, పెన్నీ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవడంతో ఆల్బమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అటు రిలీజ్ డేట్ కూడా దగ్గర పడటంతో రెగ్యులర్ అప్డేట్స్ తో ప్రమోషన్స్ లో జోరు కొనసాగిస్తుంది చిత్ర యూనిట్.కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్ మధి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.తారాగణం: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube