తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ).చాలా తక్కువ సమయం లోనే తనని తాను హీరోగా పొట్రే చేసుకొని స్టార్ హీరోగా నిలబడగలిగాడు.
కృష్ణ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లందర్నీ క్యాష్ చూసుకుంటూనే యూత్ లో చాలా మంచి ఫాలోయింగ్ సంపాదించగలిగాడు.మహేష్ బాబుతో కామెడీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలను( Mass Action Movies ) తీస్తే ఆ సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లు సాధిస్తాయి.
కానీ హెవీ సెంటిమెంటల్ డ్రామలను( Heavy Sentimental Dramas ) తీస్తే మాత్రం అవి పెద్దగా సక్సెస్ అవ్వవు అనే విషయం చాలా సినిమాల విషయంలో నిజమైంది.మహేష్ బాబు డైరెక్షన్ లో చేసిన నిజం సినిమా సెంటిమెంటల్ డ్రామాగా తెరకెక్కింది.ఇక ఈ సినిమా ప్రేక్షకులను అస్సలు అలరించలేదు.అలాగే అర్జున్ సినిమా( Arjun Movie )లో కూడా సిస్టర్ సెంటిమెంట్ హెవీగా ఉండడంతో అది కూడా పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు.
ఇక వన్ సినిమాలో సినిమా మొత్తం మదర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ మీద తిరుగుతూ ఉంటుంది.
కాబట్టి ఈ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు.ఇక రీసెంట్ గా గుంటూరు కారం సినిమా( Gutur Kaaram ) కూడా మదర్ సెంటిమెంట్ తో ఉండడంవల్ల ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు.అయితే దూకుడు సినిమా( Dookudu )లో ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది కానీ అది మరీ డ్రమటికల్ గా ఉండదు.
అలాగే ఆ సినిమాలో కామెడీ కి ఎక్కువ ప్రీయారిటీ ఉంటుంది.అందువల్లే ఆ సినిమా హిట్ అయింది.కాబట్టి మహేష్ బాబు తో సినిమాలు చేయాలనుకునే దర్శకులు మంచి మాస్ మసాలా లాంటి సినిమాలను తెరకెక్కిస్తే మంచిదని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
.