రియాల్టీ షోకి వ్యాఖ్యాతగా సూపర్ స్టార్ మహేష్ బాబు.....?

తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పనవసరం లేదు.ఇప్పటికే ఈ రియాల్టీ గేమ్ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకొని నాలుగో సీజన్ కి సిద్ధమవుతోంది.

 Superstar Mahesh Babu As Anchor Of Reality Show-TeluguStop.com

అయితే  ప్రస్తుతం బిగ్ బాస్ నాలుగో సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వినిపిస్తోంది.అంతేగాక ఈ షో నిర్వాహకులు ఇప్పటికే మహేష్ బాబుని సంప్రదించినట్లు సమాచారం.

కానీ ఈ షోకి మహేష్ బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారా లేదా అటువంటి విషయంపై మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి స్పష్టత లేదు.అయితే ఈ బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో వ్యాఖ్యాతల రేసులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ షో నాలుగో సీజన్ మొదలవడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ షో నిర్వాహకులు మాత్రం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.అంతేగాక ఈ సారి  పలువురు ప్రముఖులు కంటెస్టెంట్ లుగా పాల్గొనబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Telugu Bigg Boss, Mahesh Babu, Maheshbabu, Telugumahesh-Movie

అయితే ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ మొదటి సీజన్లో  యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా రెండో సీజన్లో నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అయితే మూడో సీజన్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.మొదట బాలీవుడ్లో మొదలైన ఈ గేమ్ షో ప్రస్తుతం దాదాపుగా అన్ని భాషల్లోనూ అనువాదమవుతోంది.ఇప్పటికే బాలీవుడ్లో దాదాపుగా 12 సీజన్లు విజయవంతంగా ముగించుకొని 13వ సీజన్ కూడా విజయవంతంగా దూసుకుపోతోంది.

ప్రస్తుతం ఈ హిందీలో ప్రసారం అవుతున్నటివంటి ఈ షో కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్నాడు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube