ఆ విషయంలో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ మహేష్..!

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరో మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రిన్స్ మహేష్ బాబు ఎప్పటికప్పుడు సామాజిక సేవలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.

 Mahesh Babu Reaches 11 Million Followers In Twitter, Mahesh Babu Twitter, Instag-TeluguStop.com

అలాగే మహేష్ తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటాడు.ఇక అందుకే ఈ మధ్య కాలంలో మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అయిందట.

గతంలో ఏ సినిమా రిలీజ్, బర్త్ డే రోజున ఏ హీరోకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు అనే అంశాన్ని ఒక అంచనా వచ్చేది కానీ ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాలలో సోషల్ మీడియా హవా బాగా కొనసాగుతుంది. ట్విట్టర్ లో ఫలానా హీరో కి ఉన్న ఫాలోయింగ్ ను బట్టి.

ట్రీజర్ ట్రైలర్ లాంటివి వైరల్ అయిన సమయాన్ని అనుసరించి వారి అభిమానాన్ని చూపుతున్నారు.

అంతేకాకుండా సోషల్ మీడియా లోపల హీరోకి ఎంత మంది ఫాలోయింగ్ ఉన్నారన్న దాన్ని బట్టే వాళ్ళకి ఆ హీరో కి ఉన్న క్రేజ్ ను అంచనా వేస్తున్నారు.

ఈ తరుణంలోనే దక్షిణాది హీరోలలో తెలుగు ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.మహేష్ ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా దక్షిణాది హీరోలలో సరికొత్త రికార్డును సృష్టించాడు.

ప్రస్తుతం ట్విట్టర్ లో మహేష్ బాబుకు ఫాలో అవుతున్న వారి సంఖ్య 11 మిలియన్ ప్లస్ కు చేరుకుంది.ఇక ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ ఖాతాలలో మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ , టూర్ లకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేస్తూ ఉంటాడు.

అలాగే తన పిల్లలతో సమయం కేటాయించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు.ఒకవైపు మాస్, మరోవైపు క్లాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేష్ బాబు టాప్ స్థానంలో నిలుస్తున్నాడు.

ఇక కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నాడు.

Telugu Face, Followers, Mahesh Babu, Maheshbabu-Latest News - Telugu

ఈ తరుణంలోనే ట్విట్టర్ లో మహేష్ బాబు 11 మిలియన్ల క్లబ్ లో చేరుకున్నాడు.అంతేకాకుండా దక్షిణాది హీరోలు 11 మిలియన్ల క్లబ్ లోకి చేరిన మొదటి హీరో మహేష్ బాబు కావడం విశేషం.దీంతో #11millionmaheshians అనే హ్యష్ ట్యాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

అంతేకాకుండా మహేష్ బాబు ఫ్యాన్స్ ఆల్ టైం రికార్డ్ అంటూ దూకుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ తో క్రియేట్ చేసి చేస్తున్నారు.ఇక ఇప్పటికే మహేష్ బాబుకు ఫేస్బుక్ లో 5.8 మిలియన్ ఫాలోవర్స్, ఇంస్టాగ్రామ్ లో 6.1 మిలియన్ ఫాలోవర్స్ తో కొనసాగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube