అభిమానిని తలుచుకొని కంటతడి పెట్టుకున్న సూపర్ స్టార్ కృష్ణ!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గురించి మనకు సుపరిచితమే.ఈయన సినీ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Superstar Krishna Who Brought Tears To The Eyes Of A Fan , Superstar Krishna, Tollywood, Emotional, Fan, Telugu Film Industry , Pro Ba Raju , Madras-TeluguStop.com

ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలలో నటించిన కృష్ణ ప్రస్తుతం వయసు పైబడటంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.ఇకపోతే తాజాగా ఈయన తన అభిమానిని తలుచుకొని ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఏం జరిగింది? ఆ అభిమాని ఎవరు అనే విషయానికి వస్తే.

 Superstar Krishna Who Brought Tears To The Eyes Of A Fan , Superstar Krishna, Tollywood, Emotional, Fan, Telugu Film Industry , PRO BA Raju , Madras-అభిమానిని తలుచుకొని కంటతడి పెట్టుకున్న సూపర్ స్టార్ కృష్ణ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ దివంగత నిర్మాత, పీఆర్‌ఓ బీ.ఏ రాజు గత ఏడాది ఆకస్మికంగా మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఈయన మరణించి నేటితో (మే 21) ఏడాది పూర్తి కావడంతో, ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ బి.ఏ.రాజును తలచుకుని ఎమోషనల్ అవుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.బి.ఏ రాజు తనకు పెద్ద అభిమాని అని, తానే తనని మద్రాసు తీసుకు వెళ్లానని ఈ సందర్భంగా కృష్ణ గుర్తుచేసుకున్నారు.అప్పట్లో నాకు ఎవరైనా అభిమానులు మెయిల్ చేస్తే వాటికి రిప్లై ఇవ్వడం కోసమే బిఏ రాజును మద్రాసుకు తీసుకెళ్లినట్లు కృష్ణ తెలిపారు.

ఈ విధంగా అభిమానుల మెయిల్ కు రిప్లై ఇస్తూ తనకు ఎంతో మంది అభిమానులను పెరిగేలా చేశాడు.అనంతరం తనకు జర్నలిస్టు కావాలని ఉంది ఏదైనా వార్తాపత్రికకు తన పేరును సిఫార్సు చేయమని అడిగితే కృష్ణ గారు స్వయంగా తన పేరును జ్యోతిచిత్రకు సిఫార్సు చేశారని అనంతరం ఆయన ఎన్నో పత్రికలలో చేసి చివరకు తానే సొంతంగా సూపర్ హిట్ పత్రిక పెట్టినట్లు తెలిపారు.తెలుగు సినిమా పేపర్లలో నెంబర్ వన్ పత్రికగా సూపర్ హిట్ పత్రికను తీర్చిదిద్దాడని కృష్ణ ఈ సందర్భంగా తన గురించి గుర్తు చేసుకున్నారు.

అనంతరం ఈయన నిర్మాతగానూ, అలాగే పీఆర్‌ఓగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన రాజు ఇలా మన అందరిని ఇంత త్వరగా విడిచి వెళ్లిపోవడం బాధాకరం అంటూ తనని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube