సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు.. బుర్రిపాలెంలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసిన మహేష్..!

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రికి బర్త్ డే విష్ చేయడమే కాకుండా ఆయన పేరు మీద స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు సూపర్ స్టార్ మహేష్.కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు మహేష్.తనని నడిపించింది నాన్నే థ్యాంక్ యు నాన్నా.హ్యాపీ బర్త్ డే అంటూ మహేష్ ట్వీట్ చేశారు.ఇక తండ్రి పుట్టినరోజు స్పెషల్ గా ఏదైనా చేయాలని బుర్రిపాలెంలో వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు మహేష్.అక్కడ తన టీం తో ఈ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వాహణ ఏర్పాటు చ్శారు.

 Superstar Krishna Birthday Mahesh Conducted Special Vaccine Drive At Burripalem,-TeluguStop.com

శ్రీమంతుడు సినిమాలో నటించడమే కాదు నిజమైన శ్రీమంతుడు అనిపించుకునేలా మహేష్ తన గొప్ప మనసు చాటుకుంటున్నాడు.ఇప్పటికే రెయిన్ బో హాస్పిటల్స్ తో కలిసి 1000 మందికిపైగా చిన్న పిల్లల గుండె ఆపరేషన్ చేయించిన మహేష్ ఆంధ్రాలో బుర్రిపాలెం, తెలంగాణాలో సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు.

ఆ గ్రామల అభివృద్ధి చేసే బాధ్యత మహేష్ తన మీద వేసుకున్నారు.ఇక కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా బుర్రిపాలెం లో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.

 అక్కడి ప్రజలు ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వినియోగించుకుంటున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube