నటి సర్జరీ ఫెయిల్.. అందవిహీనంగా మారిపోయిన అందగత్తె?

ఫ్యాషన్ ప్రపంచంలో గత దశాబ్దాల కాలం నుంచి ఆమెకి ఎవరు సాటిలేరు.ఫ్యాషన్ రంగంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ మోడల్ ప్రస్తుతం నాలుగు గోడలకే పరిమితం అయింది.

 Supermodel Linda Evangelista Is Disfigured After Cosmetic Treatment Gone Wrong-TeluguStop.com

ఎన్నో స్టేజ్ లపై ర్యాంప్ వాక్ చేసిన ఈమె ఇలా నాలుగు గోడలకు పరిమితం కావడానికి కారణం ఏమిటి? అనే విషయాలకు వస్తే అందుకు గల కారణం కేవలం ఆమె సర్జరీ వికటించడమే అని చెప్పవచ్చు.కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నటి ఆ సర్జరీ ఫెయిల్ కావడంతో ఎంతో అందవిహీనంగా మారిపోయి కేవలం నాలుగు గోడలకే పరిమితం అయింది.

ఇంతకీ ఆమె ఎవరు ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం.

 Supermodel Linda Evangelista Is Disfigured After Cosmetic Treatment Gone Wrong-నటి సర్జరీ ఫెయిల్.. అందవిహీనంగా మారిపోయిన అందగత్తె-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత దశాబ్దాల కాలం నుంచి మోడల్ గా నటిగా ఎంతో పేరు సంపాదించుకున్న సూపర్ మోడల్ లిండా ఎవెంగెలిస్టా.80వ దశకంలోనే కెరియర్ స్టార్ట్ చేసిన కెనడియన్ మోడల్.ఈమె మోడల్ గా కేవలం ర్యాంప్ వాక్ కి మాత్రమే పరిమితం కాకుండా ఎన్నో మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసింది.

అయితే గత ఐదు సంవత్సరాల క్రితం కొద్దిగా బొద్దుగా మారిన మోడల్ మరింత నాజూకుగా కనిపించడం కోసం ఫాట్ రిమూవింగ్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారు.ఈ సర్జరీ ద్వారా స్లిమ్ గా మారుతుందనుకున్న ఆమె శరీరం మరింత బొద్దుగా తయారయింది.

ఈ కాస్మెటిక్ సర్జరీ తర్వాత తన బాడీ మొత్తం షేప్ లెస్ కావడంతో మోడల్ బయటకు రావడానికి సంకోచం వ్యక్తం చేస్తోంది.

Telugu Canadian Model Linda Evangelista, Canadiyan, Cosmetic Treatment, Fat Removing Surgery, Hollywood, Linda Evangelista, Linda Evangelista Cosmetic Surgery, Super Model, Surgery Gone Wrong-Movie

ఈ క్రమంలోనే నిత్యం ఇంటిలో నాలుగు గోడలకు పరిమితం అయింది.జెల్టింగ్ కూల్ స్కల్పింగ్ విధానం ద్వారా బాడీ పూర్తిగా మారిపోయిందని, దీంతో మోడలింగ్ వర్క్ చేయకపోవడం వల్ల ఎంతో మంది అభిమానులు విచారణ వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా లిండా తెలియజేసింది.ఈ సర్జరీ వికటించి నప్పటికీ తన బాడీని సరైన రీతిలోకి తీసుకు రావడం కోసం మరో రెండు సర్జరీలు చేయించినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదని…ఈ క్రమంలోనే తనకు సర్జరీ చేసిన కాస్మెటిక్ కంపెనీ పై తన కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

మొత్తానికి ఎంతో అందంగా ఉన్న ఈమె అత్యాశకు పోయి సర్జరీ ద్వారా పూర్తిగా అందవిహీనంగా మారిందని చెప్పవచ్చు

.

#Cosmetic #Hollywood #CanadianLinda #Fat Surgery #Canadiyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు