చిత్రమైన సూపర్‌ మార్కెట్‌ వాళ్ళు చేసిన పనికి అబినందించకుండా ఉండలేరు

మార్చి చివరి నుండే ఎండలు మండి పోతున్నాయి.ఏప్రిల్‌ వచ్చి ఇంకా రెండు వారాలు పూర్తి కాలేదు బయటకు వెళ్లలేని పరిస్థితి.

 Supermarket Praised For Replacing Plastic Produce Packaging With Banana Leaves-TeluguStop.com

బయటకు వెళ్తే సేఫ్‌గా ఇంట్లోకి తిరిగి వస్తామా లేదా అనే భయం ఉంది.ఎందుకంటే ఎండలు అంతగా మండి పోతున్నాయి.

ఇంతగా ఎండలు మండేందుకు కారణం గ్లోబల్‌ వార్మింగ్‌ అని అందరికి తెలుసు.గ్లోబల్‌ వార్మింగ్‌ ఎందుకు అవుతుందంటే కూడా అందరికి తెలుసు.

చెట్లు పెంచక పోవడంతో పాటు, ప్లాస్టిక్‌ వాడటం వల్ల గ్లోబల్‌ వార్మింగ్‌ అవుతుందని చిన్న పిల్లలు కూడా చెబుతారు.

ఇంత తెలిసిన వారు దాన్ని తగ్గించేందుకు మాత్రం ఆసక్తి చూపరు.

ఎందుకంటే నేను ఒక్కడిని చేస్తే ఏం ప్రయోజనం, నేను ఒక్కడిని ఈ ప్రపంచాన్ని మారుస్తానా అనుకుంటాడు.మార్పు అనేది ఒక్కరితోనే సాధ్యం అవ్వాలి.ఆ మార్పు వల్ల ప్రపంచం మొత్తం మారుతుంది.ఈ విషయాన్ని జనాలు అస్సలు అర్థం చేసుకోలేక పోతున్నారు.

మార్పు అనేది చాలా పెద్దది, కాని ఆరంభం మాత్రం చాలా చిన్నది అనే విషయాన్ని గుర్తించడం లేదు.తాజాగా థాయిలాండ్‌కు చెందిన ఒక సూపర్‌ మార్కెట్‌ వారు మార్పుకు నాంది పలికారు.

ఆ సూపర్‌ మార్కెట్‌లో అసలు ప్లాస్టిక్‌ అనేది కనిపించదు.ప్లాస్టిక్‌ కవర్లను పూర్తిగా నిషేదించారు.

ప్రతి వస్తువు కూడా అక్కడ అరటి ఆకు లేదంటే మరే ఇతర ఆకుతో అయినా ప్యాక్‌ చేసి ఉంటుంది.ఇలాంటి చిత్రమైన సూపర్‌ మార్కెట్‌ గురించి విన్న స్థానికులు ఆ సూపర్‌ మార్కెట్‌ యాజమాన్యంను అభినందించడంతో పాటు, ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో అక్కడే కొనుగోలు చేయడం ప్రారంభించారు.సూపర్‌ మార్కెట్‌లోని ప్రతి ఒక్క వస్తువును కూడా చాలా జాగ్రత్తగా ఆకుల్లో ప్యాక్‌ చేసి అంతే జాగ్రత్తగా వినియోగదారులకు అందిస్తున్నారు.ఇలా ప్రపంచం మొత్తం కూడా మారితో గ్లోబల్‌ వార్మింగ్‌ అనేది మరో పదేళ్లలో పోతుందని నిపుణులు అంటున్నారు.

కాని ప్రపంచం తలకిందులు అయినా అలా జరగదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube