చాక్లెట్ బార్ వివాదం: టెస్కో స్టోర్‌పై దావా వేసిన భారత సంతతి లాయర్

తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు అనారోగ్యానికి గురవ్వడానికి కారణమైందంటూ యూకేలోని అతిపెద్ద చైన్ సూపర్‌ మార్కెట్ సంస్థ టెస్కోపై భారత సంతతి లాయర్ 70,000 పౌండ్లు (91,151 డాలర్లు)దావా వేశాడు.లాలూ హనుమాన్ అనే 63 ఏళ్ల న్యాయవాది యూకేలో నివసిస్తున్నాడు.
ఆయన ఓ రోజున సంగీత కచేరికి వెళుతూ సెంట్రల్ లండన్ రస్సెల్ స్క్వేర్‌లో ఉన్న టెస్కో స్టోర్‌లో… 1.05 పౌండ్ల విలువ చేసే వెజ్ చాక్లెట్ బార్ కొనుగోలు చేసి సెల్ఫ్ సర్వీస్‌లో బిల్ కట్టాడు.బయటికి వస్తూ… బిల్ రసీదును డస్ట్ బిన్‌లో వేశాడు.అయితే ఎక్జిట్ గేట్ వద్ద హనుమాన్‌ను సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు.అతను రసీదు చూపించకపోవడంతో చాక్లెట్ బార్‌ను దొంగతనం చేశాడని భావించిన గార్డ్ హనుమాన్‌ను బలవంతంగా స్టోర్‌‌లోపలికి తోశాడు.

 Supermarket Chain Tesco Chocolate-TeluguStop.com

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఈ ఘటన కారణంగా తనకు కిడ్నీలలో రాళ్ల సమస్య తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేశాడు.వెంటనే తనకు జరిగిన నష్టాన్ని చెల్లించాలంటూ కోర్టులో దావా వేశాడు.దీనిపై స్పందించిన టెస్కో యాజమాన్యం.

హనుమాన్ చాక్లెట్‌కు నగదు చెల్లించినట్లు అంగీకరించింది.అలాగే బార్ కోడ్ వద్ద డబుల్ స్వైపింగ్ చేయడం ఈ గందరగోళానికి కారణమని వివరించింది.

సెల్ఫ్ సర్వీస్ చెక్ ఔట్ వద్ద సిబ్బంది సాయాన్ని తీసుకుని ఉంటే బాగుండేదని సంస్థ అభిప్రాయపడింది.ఈ దావా కేసుపై విచారణను కోర్టు జూలై 21కి వాయిదా వేసింది.

Supermarket-Chain-Tesco Chocolate చాక్లెట్ బార్ వివాదం

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube