బాలయ్య సినిమాకు కొత్త టైటిల్.. సూపర్ అంటోన్న ఫ్యాన్స్!  

Balakrishna Boyapati Movie Titled Superman, Balakrishna, Boyapati Srinu, Superman, Monarch, Tollywood News - Telugu Balakrishna, Boyapati Srinu, Monarch, Superman, Tollywood News

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Superman Balakrishna Boyapati Srinu

ఇక రీసెంట్‌గా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.మరోసారి బాలయ్యకు సాలిడ్ హిట్ అందించేందుకు బోయపాటి ప్రయత్నిస్తున్నాడు.

టీజర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఈ సినిమాకు మరింత పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.కాగా ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి.

బాలయ్య సినిమాకు కొత్త టైటిల్.. సూపర్ అంటోన్న ఫ్యాన్స్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న పవర్‌ఫుల్ పాత్రలకు ఈ టైటిల్ అయితే బాగుంటుందని వారు భావించారు.కానీ ఈ టైటిల్ విషయంపై క్లారిటీ లేకపోవడంతో, ఇప్పుడు మరో టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు ‘సూపర్‌మాన్’ అనే టైటిల్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న రైతు పాత్రను సూపర్‌గా ఎలివేట్ చేయనున్నారు చిత్ర యూనిట్.

అందుకే ఈ టైటిల్ అయితే సినిమాకు బాగుంటుందని వారు ఆలోచిస్తున్నారట.మరి బాలయ్య చేయబోయే రెండో పాత్ర అఘోరాకు సంబంధించి ఈ టైటిల్ ఎంతవరకు న్యాయం చేస్తుందనే విషయాన్ని వారు ఆలోచిస్తున్నారట.

ఏదేమైనా బాలయ్య కోసం ఇలా పవర్‌ఫుల్ టైటిల్స్‌ను బోయపాటి అండ్ టీమ్ రెడీ చేస్తోంది.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ కొత్త బ్యూటీ హీరోయిన్‌గా నటించనుంది.

#Balakrishna #Boyapati Srinu #Superman #Monarch

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Superman Balakrishna Boyapati Srinu Related Telugu News,Photos/Pics,Images..