సిగరెట్ దుష్ప్రభావాన్ని తగ్గించే ఆహారాలు ఇవిగో

సిగరెట్ శరీరానికి ఎన్నిరకాలుగా అపకారం చేస్తుందో మేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు.అదంతా మీకు తెలిసిన విషయమే.

 Superfoods That Can Flush Out Cigarette’s Nicotine From Body-TeluguStop.com

ఇక సిగరెట్ ఊపిరితిత్తులకి అంతలా హాని తలపెట్టడానికి కారణం నికోటిన్ అనే హానికరమైన టాక్సిన్ అన్న సంగతి కూడా మీకు తెలిసే ఉంటుంది.ఈ నికోటిన్ వలనే శ్వాసలో ఇబ్బందులు, ఈ నికోటిన్ వలనే హై బ్లడ్ ప్రెషర్, ఈ నికోటిన్ వలనే బాడిలో ఎక్కడలేని మలీనాలు.

అందుకే మొదట సిగరెట్ అలవాటు మానెయ్యాలి.అయినా నికోటిన్ పూర్తిగా ఒంట్లోంచి బయటకి పోదు.

నికోటిన్ ని బయటకి తోయాలంటే డైట్ లో ఈ పదార్థాలు చేర్చుకోవాల్సిందే.

* అసలు రోజు మంచినీరు బాగా తాగే అలవాటే ఉంటే, రోగాలు దగ్గరకి రావడం కూడా కష్టమే.

కాబట్టి సిగరెట్ కంపుని, అది మోసుకొచ్చిన ప్రాణాంతక నికోటిన్ ని మంచినీళ్ళు రోజు బాగా తాగి బయటకి తరమండి.

* ఆరెంజ్ లో విటమిన్ సి ఉంటుందని రోజు చదువుకుంటున్నాం.

ఇది మెటబాలిజం ని మెరుగుపరిచి నికోటిన్ సాధ్యమైనంత త్వరగా బయటకి వెళ్ళేలా చేస్తుంది.

* దానిమ్మ బ్లడ్ సర్కులేషన్ ని మెరుగుపరుస్తుంది.

దాంతో నికోటిన్ బయటకి ఫ్లష్ అవటం సునాయాసం అవుతుంది.కాబట్టి స్మోకింగ్ హ్యాబిట్ మానేసి రోజుకో దానిమ్మ తినాలి.

* అరేంజ్ లో ఉన్నట్టే బ్రోకోలిలో కూడా విటమిన్ సి ఉంటుంది.దాంతోపాటు విటమిన్ బి5 కూడా ఉంటుంది.

ఇక్కడ మీకు తెలియని విషయం ఏమిటంటే సిగరెట్ అలవాటు ఒంట్లో విటమిన్ సి శాతాన్ని తగ్గిస్తుంది.విటమిన్ సి శాతం పెరిగి, నికోటిన్ పరుగు తీయాలంటే ఆరెంజ్, బ్రోకోలి ఎక్కువగా తినాలి.

* క్యారట్ జ్యూస్ లో విటమిన్ ఏ, సి, కే, మరియు బి ఉండటం వలన స్మోకర్స్ కి క్యారట్ ని సజెస్ట్ చేస్తారు న్యూట్రిషన్ నిపుణులు.

* పాలకూరని ఇష్టపడండి.

దండిగా విటమిన్లు, మినరల్స్ దొరకరడం వలన ఇది ఒంటిని లోపలినుంచి శుభ్రపరుస్తుంది.నికోటిన్ బయటపడటం తేలికవుతుంది.

* ఇవే కాక, బెర్రిస్, కీవి, డ్రై హర్బ్స్ కూడా నికోటిన్ ని బయటకి తీయడంలో సహాయపడతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు