రోగనిరోధకశక్తి పెరగాలంటే ఏం తినాలి?  

Superfoods That Can Boost Your Immunity-

English Summary:For some people, usually not fever. Even those who do not remember the last time, when the hospital ever.The reason for the well-being immunity. On the other hand, some small storm comes, think Babble infections.Fever, cough, common cold, such as those who have a lot of problems. Tattukolenanta is sensitive to even minor health problems in their body.The difference, low immunity. What happened, immunity with little effort, could raise alavatlatone Chin Chin.
* If the daily habit of drinking honey is very good. It raises immunity.The yantiaksidents, yantimaikrobiyal, yantibyaktiriyal many more features. For children less than one year of age, except for the honey can be useful to everyone.
* Ginger yantiphangal, antiviral, antibiotics properties are much higher doses. It is not impheksanlane calarakala, addukogadu diseases such as cancer.
* Vitamin C increases the white blood cells. This is tellaraktakanale, fighting disease.To vitamin C, Guavas, Orange eat.
* Fever is not only when inkelanti viral infection, chicken soup is drinking.

కొందరికి జ్వరం సామాన్యంగా రాదు. చివరిసారి హాస్పిటల్ కి ఎప్పుడూ వెళ్ళారో కూడా గుర్తుండదు వారికి. కారణం, రోగనిరోధకశక్తి బాగా ఉండటం..

రోగనిరోధకశక్తి పెరగాలంటే ఏం తినాలి?-

మరోవైపు, కొంతమందికి చిన్న గాలివాన వచ్చినా, ఏవేవో ఇంఫెక్షన్స్ వచ్చేస్తాయి. జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలు చాలా కామన్ వారికి. చిన్న చిన్న అరోగ్య సమస్యలు కూడా తట్టుకోలేనంత సున్నితంగా ఉంటుంది వారి శరీరం.

తేడా, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం. ఏం ఫర్వాలేదు, రోగనిరోధకశక్తిని పెద్దగా కష్టపడకుండా, చిన్ని చిన్ని అలవాట్లతోనే పెంచుకోవచ్చు. * రోజూ తేనె తాగే అలవాటు ఉంటే చాలా మంచిది.

ఇది రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది. ఇందులో యాంటిఆక్సిడెంట్స్, యాంటిమైక్రోబియల్, యాంటిబ్యాక్టిరియల్ లక్షణాలు చాలా ఎక్కువ. ఏడాది కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి తప్ప, అందరికీ తేనే ఉపయోగపడుతుంది.

* అల్లంలో యాంటిఫంగల్, యాంటివైరల్, యాంటిబయాటిక్స్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇది చాలారకాల ఇంఫెక్షన్లనే కాదు, క్యాన్సర్ లాంటి జబ్బుని కూడా అడ్డుకోగదు. * విటమిన్ సి వైట్ బ్లడ్ సెల్స్ ని పెంచుతుంది.

ఈ తెల్లరక్తకణాలే కదా, జబ్బులతో పోరాడేవి. విటమిన్ సి ని పొందాలంటే, జామపండ్లు, ఆరెంజ్ తినాలి. * జ్వరము మాత్రమే కాదు, ఇంకెలాంటి వైరల్ ఇంఫెక్షన్ వచ్చినా, చికెన్ సూప్ తాగడం పనిచేస్తుంది.

ఇందులో దొరికే ప్రొటీన్లు, కాల్షియం, జింక్, విటమిన్ బి ఇంఫెక్షన్స్ తో పోరాడతాయి. కాబట్టి ప్రోటీన్‌లు బాగా దొరికేలా డైట్ ని ప్లాన్ చేసుకోవాలి. చికెన్ ని ప్రేమించాలి.

* మష్రూమ్స్ ఎక్కువగా అందుబాటులో ఉండవు కాని, ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే కాపర్, సెలెనియం, యాంటిఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువ. ముఖ్యంగా గుండె, లివర్ ని ఇంఫెక్షన్స్, జబ్బుల నుంచి రక్షించేందుకు ఉపయోగపడతాయి మష్రూమ్స్. * స్వీట్ పొటాటో కూడా ఇమ్యునిటి బూస్టింగ్ పదార్థం.

ఇందులో బేటాకిరోటిన్ అనే పదార్థం ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతూ, ఇమ్యునిటి సెల్స్ ని పెంచుతుంది. * ఉదయాన్నే గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే ఇమ్యూన్యిటి సిస్టమ్ కి మేలు చేసినవారవుతారు. ఒకటి కాదు, రెండు కాదు, గ్రీన్ టీ అడ్డుకునే రోగాల పేర్లతో పేజీలు నింపొచ్చు.

దీనికి అంత శక్తి ఎక్కడిది అంటే, epigallocatechin gallate (EGCG) అనే ఫ్లెవొనాయిడ్ వలన ఇది గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, స్ట్రోక్ . ఇంకెన్నో సమస్యలను అడ్డుకుంటుంది.

అయితే, గ్రీన్ టీని పాలు కలపకుండా తాగాలి.