మీ అభిమాన రెనాల్ట్ ఇండియా నుండి సూపర్ కార్లు... అదిరిపోయే ఫీచర్లు ఇవే!

అవును, మీ అభిమాన రెనాల్ట్ ఇండియా నుండి సూపర్ కార్లు ఇపుడు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి.Renault Kiger, Triber Car, Kwid Cars అనే 3 కార్లు 2023 మోడల్ ఇయర్ రేంజ్, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఇపుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

 Supercars From Your Favorite Renault India These Are The Amazing Features,renaul-TeluguStop.com

ఈ కార్లు ఇప్పుడు RDE (రియల్ డ్రైవింగ్ ఉద్గారాల) నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి.కాగా ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

దాంతో కొన్నాళ్ల క్రితమే అప్‌డేట్ రేంజ్ కార్ల కోసం బుకింగ్‌లు ప్రారంభం అయిపోయాయి.

Telugu Favoriterenault, India Releases, Kwid Cars, Cars, Renault India, Renault

2023 రెనాల్ట్ కిగర్, 2023 రెనాల్ట్ ట్రైబర్, 2023 రెనాల్ట్ క్విడ్ కార్లు ఇప్పుడు ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), HSA (హిల్ స్టార్ట్ అసిస్ట్), TCS (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్లతో మార్కెట్లోకి రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.RDE నిబంధనల అమలుతో.అన్ని రెనాల్ట్ కార్లు ఆటో-డయాగ్నోస్టిక్ డివైజ్ కలిగి ఉంటాయి.

ఈ డివైజ్ కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనం ఉద్గార స్థాయిలను నిరంతరం మానిటరింగ్ చేస్తుంది.

Telugu Favoriterenault, India Releases, Kwid Cars, Cars, Renault India, Renault

ఇక రెనాల్ట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌, క్విడ్ లైనప్‌కు కొత్త వేరియంట్ RXEని కూడా యాడ్ చేసింది.క్విడ్ RXE 1.0 MT ధర రూ.4.69 లక్షలు కాగా భారత ప్రభుత్వ క్లీన్ అండ్ గ్రీన్ ఇన్విరాన్‌మెంట్ నిబంధనలకు కట్టుబడి తయారుచేయబడింది.ఈ 3 రెనాల్ట్ కార్లలో సెక్యూరిటీ పరంగా చాలా సురక్షితమైనదిగా చెప్పుకోవచ్చు.

కొత్త 2023 రేంజ్ కొత్త క్లాస్-లీడింగ్ సేఫ్టీ ఫీచర్లతో పాటు భారతీయ కస్టమర్లకు అందుబాటులో ఉండేలా రెనాల్ట్ అడుగులు వేస్తోందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.ఇక MY23 రెనాల్ట్ కార్ల ధరలు (ఎక్స్-షోరూమ్) ఎలా ఉన్నాయో చూసుకుంటే, 2023 రెనాల్ట్ కిగర్ ధర – రూ.6 లక్షలు – రూ.10.77 లక్షలు; 2023 రెనాల్ట్ ట్రైబర్ – రూ.6 లక్షలు – రూ.8.63 లక్షలు; 2023 రెనాల్ట్ క్విడ్ – రూ.4.69 లక్షలు – రూ.5.99 లక్షలుగా వున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube