పాన్ ఇండియా హీరోగా మారేందుకు ప్లాన్ చేస్తున్న స్టార్ హీరో విజయ్  

కోలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో ఇళయదళపతి విజయ్.తమిళ ఇండస్టీలో రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ తెలుగు బాషలో కూడా ఓ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

TeluguStop.com - Super Star Vijay Plan Pan India Movie Next

కోలీవుడ్ లో ఇతని సినిమాలకి రెండు వందల కోట్ల వరకు మార్కెట్ ఉంది.అయితే అతని మార్కెట్ ని మరింత పెంచుకోవడానికి ఇప్పుడు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రభాస్ మొదలు కొని అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వరకు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు.హిందీలో కూడా తమ మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

TeluguStop.com - పాన్ ఇండియా హీరోగా మారేందుకు ప్లాన్ చేస్తున్న స్టార్ హీరో విజయ్-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే కోలీవుడ్ లో కమల్ హసన్, రజినీకాంత్ తప్ప ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న హీరోలు లేరు.ఇప్పుడు ఆ ఫీట్ ని విజయ్ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు.

దీనికి గాను తన నెక్స్ట్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు.ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తో మాస్టర్ సినిమా చేసిన విజయ్ నెక్స్ట్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని అనుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో కేవలం తమిళ్ ఆర్టిస్ట్ లని మాత్రమే కాకుండా బాలీవుడ్, టాలీవుడ్ నటులకి కూడా సినిమాలో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడు.

ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.యూనివర్శల్ అప్పీల్ ఇస్తే అప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

#Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Super Star Vijay Plan Pan India Movie Next Related Telugu News,Photos/Pics,Images..