వైజాగ్ లో సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి నెక్స్ట్ షెడ్యూల్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాలలో జరిగినవి చాలా తక్కువ అని చెప్పాలి.కెరియర్ ఆరంభంలో ఏవో కొన్ని సినిమాలు వైజాగ్ లో షూట్ చేశారు.

 Super Star Sarkaru Vaari Paata Movie Next Schedule In Visakhapatnam, Director Pa-TeluguStop.com

అయితే ఇప్పుడు పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీ షూటింగ్ కోసం చాలా ఏళ్ల తర్వత సూపర్ స్టార్ మహేష్ బాబు వైజాగ్ రానున్నాడు.

ఈ విషయాన్ని దర్శకుడు పరశురాం అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు.

భారీ బడ్జెట్ తో సర్కారు వారి పాట మూవీ తెరకెక్కుతుంది.యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యింది.బ్యాంకులని రుణాల పేరుతో మోసం చేస్తూ విదేశాలు పారిపోయిన కార్పోరేట్ దొంగల కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబుకి జోడీగా కనిపించబోతుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం దర్శకుడు పరశురాం రెడీ అవుతున్నాడు.

Telugu Parasuram, Keerthi Suresh, Mahesh Babu, Shedule, Sarkaruvaari, Visakhapat

అందులో భాగంగా విశాఖకి లోకేషన్స్ చూడటానికి వచ్చారు.ఈ సందర్భంగా సర్కారు వారి పాట సినిమాలో ఓ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలని విశాఖలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.త్వరలో విశాఖ షెడ్యూల్ ఉంటుందని, ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొంటారని స్పష్టం చేశారు.మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ షూటింగ్ విశాఖలో జరగబోతుంది అనే తెలియడంతో ఉత్తరాంధ్రలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం ఆ సమయం కోసం వేచి చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube