రజనీకాంత్ ముఖానికి లిప్ స్టిక్.. ఆ పని చేసిన వ్యక్తి ఎవరంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమా నిన్న థియేటర్లలో విడుదలై నెగిటివ్ టాక్ ను సంపాదించుకుంది.తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు తొలిరోజే కోటీ 63 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

 Super Star Rajiniknth Latha Photo Goes Viral In Social Media , Rajnikanth Daught-TeluguStop.com

మరో పది కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధిస్తే మాత్రమే ఈ సినిమా హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు.మరి ఆ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.

సినిమాల్లో విలన్లను ఒక ఆట ఆడించే రజనీకాంత్ నిజ జీవితంలో మాత్రం నెమ్మదస్తుడు కావడం గమనార్హం.దాదాపుగా 40 సంవత్సరాల క్రితం రజినీకాంత్ లతను వివాహం చేసుకున్నారు.

లత రజినీకంత్ కు జీవితంలో ఎన్నో సర్ప్రైజ్ లు ఇచ్చారు.తాజాగా అలాంటి సర్ప్రైజ్ ను రజినీకాంత్ లతల కూతురు ఐశ్వర్య ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

ఐశ్వర్య షేర్ చేసిన ఫోటోలో రజినీకాంత్ ముఖానికి లిప్ స్టిక్ ఉంది.

గతంలో ఐశ్వర్య ఈ ఫోటోను ఫ్యాన్స్ తో పంచుకోగా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Telugu Annatthe, Magazine, Peddnna, Rajinikanth, Rajnikanthface, Rajnikanthlatha

1981 సంవత్సరం ఫిబ్రవరి నెల 26వ తేదీన లత, రజినీకాంత్ ల వివాహం జరిగింది.1980 సంవత్సరంలో లత, రజనీకాంత్ లకు పరిచయం ఏర్పడింది.ఒక కాలేజ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూ కొరకు లత రజినీకాంత్ ను కలవగా ఆ ఇంటర్వ్యూ సమయంలో లత, రజినీకాంత్ ఒకరినొకరు ఇష్టపడ్డారు.

Telugu Annatthe, Magazine, Peddnna, Rajinikanth, Rajnikanthface, Rajnikanthlatha

ఆ తర్వాత రజనీకాంత్, లతలకు బెంగళూరు నగరంలో అనుబంధం ఉందని అర్థమైంది.రజనీకాంత్, లతల పెళ్లికి వాళ్ల కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో వాళ్ల పెళ్లి జరిగింది.మరోవైపు రజనీకాంత్ ఇకపై సినిమాలలో నటించరని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

రజినీకాంత్ ఇప్పటివరకు 168 సినిమాలలో నటించగా మరో రెండు సినిమాలలో ఆయన నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube