సూపర్‌ స్టార్ రేంజ్ మరీ ఇంత దారుణంగా తగ్గిందే!

సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ నటించిన అన్ని సినిమాలు అన్ని కూడా ఒకప్పుడు తెలుగు లో భారీగా వసూళ్లు సాధించేవి.ప్రతి ఒక్క సినిమా కూడా తెలుగులో స్ట్రెయిట్‌ సినిమాల రేంజ్ లో వసూళ్లు దక్కించుకున్న సందర్బాలు ఉన్నాయి.

 Super Star Rajinikanth Movie Annatthe Telugu Rights Details, Annatthhe, Film New-TeluguStop.com

అలాంటి రజినీకాంత్‌ ఈమద్య కాలంలో టాలీవుడ్‌ లో ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు.కోలీవుడ్ లో కూడా ఆయన సినిమాలు నిరాశ పర్చిన దాఖలాలు ఉన్నాయి.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.ఇదే సమయంలో ఆయన నటించిన అన్నాత్తే సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

తమిళంతో పాటు తెలుగు లో కూడా అన్నాత్తే ను భారీ ఎత్తున విడుదల చేస్తామని చెబుతున్నారు.ఒకప్పుడు రజినీకాంత్‌ మూవీ అంటే పాతిక కోట్ల వరకు బిజినెస్ జరిగేది.కాని ఇప్పుడు మాత్రం కేవలం 11.5 కోట్ల రూపాయలు మాత్రమే తెలుగు డబ్బింగ్‌ రైట్స్ కు కొనుగోలు చేయడం జరిగింది.అన్నాత్తే సినిమాను తెలుగు లో ప్రముఖ నిర్మాత రైట్స్ తీసుకునేందుకు సిద్దం కాలేదు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అన్నాత్తే ను తెలుగు లో ఒక నిర్మాత తీసుకున్నాడు.

Telugu Annatthe, Kollywood, Telugu, Rajinikanth, Tollywood-Movie

ఆయన మొదట పది కోట్లకే తీసుకోవాలని అనుకున్నాడు.కాని తమిళ నిర్మాత లు పది కోట్లకు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన 11.5 కోట్ల రూపాయల ను పెట్టి కొనుగోలు చేయడం జరిగిందని సమాచారం అందుతోంది.మొత్తానికి సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్ ఒకప్పుడు స్టార్‌ గా వెలుగు వెలిగాడు కాని ఇప్పుడు మాత్రం ఆయన రేంజ్ తగ్గిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన నుండి ఎలాంటి సినిమా వస్తుంది.ఆ సినిమా మళ్లీ ఆయన స్థాయిని పెంచుతుందా అనేది ఆసక్తిగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube