ఎన్నికల పోరుకి సిద్ధమవండంటున్న స్టార్ హీరో...  

Super Star Rajinikanth Getting Ready To The Tamilnadu Elections - Telugu Rajinikanth Election News, Rajinikanth Latest News, Rajinikanth Makkal Mandram News, Rajinikanth News, Rajinikanth Political News, Super Star Rajinikanth

సౌత్ లో సూపర్ స్టార్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది తమిళ్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్.రజినీకాంత్ తమిళంలో సినిమా పరంగానే కాకుండా తన వ్యక్తిత్వ పరంగా కూడా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Super Star Rajinikanth Getting Ready To The Tamilnadu Elections

అంతేగాక ఇప్పటికే పలురకాల చారిటబుల్ ట్రస్టులు నడుపుతూ సహాయం కోరి వచ్చిన వారికి వినకుండా తనకు తోచినంత సహాయం చేసే మంచి మనసున్న మా రాజు సూపర్ స్టార్ రజనీకాంత్.అయితే ఇటీవల కాలంలో రజనీకాంత్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇందులో భాగంగా రజిని మక్కల్ మంద్రం అనే పార్టీని స్థాపించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.అయితే ప్రస్తుతం రజనీకాంత్ తమిళ్ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.అంతేగాక వచ్చే ఏడాదిలో జరిగేటువంటి తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.ఇందులో భాగంగా తన పార్టీకి చెందినటువంటి ముఖ్యనేతలు మరియు పార్టీ సలహాదారులు కార్యకర్తలు తదితర నేతలతో భేటీ నిర్వహించి ఎన్నికల్లో విజయం సాధించేందుకు తగిన సూచనలు, సలహాలు, వ్యూహాలు గురించి చర్చించారు.

ఎన్నికల పోరుకి సిద్ధమవండంటున్న స్టార్ హీరో…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ సమావేశానికి విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది.అంతేకాక కమల్ హాసన్ కూడా ఈ సారి రజనీకాంత్ తో కలిసి పోటీచేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

అయితే అందుకు కారణాలు లేకపోలేదు.స్థానికంగా ఉన్నటువంటి  ఐ.ఎం.సి, డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ తదితర పార్టీల  పోరును తట్టుకోవాలంటే కచ్చితంగా రాజకీయ బలం ఎంతో అవసరమని అందువల్లనే ఈసారి ఎన్నికల్లో కమల్ తో కలిసి పోటీ చేసేందుకు రజిని ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ సినిమాల్లో మాత్రం తిరుగులేని సూపర్ స్టార్ గా వెలుగొందిన టువంటి రజనీకాంత్ మరి రాజకీయాల్లో ఎలా రాణిస్తాడు చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Super Star Rajinikanth Getting Ready To The Tamilnadu Elections Related Telugu News,Photos/Pics,Images..