ఆ రెండు సినిమాల్లో కూడా సూపర్‌ స్టార్‌ నటించడం లేదట  

Super Star Mohan Lal No Telugu Movies - Telugu Janatha Garage, Mahesh Babu, Ntr, Parasuram, Rumors, Super Star Mohan Lal, Trivikram

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ తెలుగులో జనతా గ్యారేజ్‌ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Super Star Mohan Lal No Telugu Movies

తెలుగులో మోహన్‌లాల్‌కు మంచి క్రేజ్‌ ఉంది.దాంతో ఆయన్ను పలు చిత్రాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.

కాని ఆయన మాత్రం తెలుగులో సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తిగా అనిపించడం లేదు.కేవలం మలయాళ చిత్రాల్లోనే ఆయన నటిస్తున్నాడు.

ఆ రెండు సినిమాల్లో కూడా సూపర్‌ స్టార్‌ నటించడం లేదట-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా ఎన్టీఆర్‌ మరియు మహేష్‌ బాబు చిత్రాల్లో ఈయన నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు.తాజాగా మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి ఈ విషయమై స్పందిస్తూ మోహన్‌లాల్‌ తెలుగు సినిమాల్లో నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో మోహన్‌లాల్‌ లేడు అంటూ వారు పేర్కొన్నారు.

ఇక మహేష్‌బాబు, పరశురామ్‌ ల కాంబో మూవీలో కూడా మోహన్‌లాల్‌ నటించడం లేదు అంటూ క్లారిటీ వచ్చింది.మోహన్‌లాల్‌ ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాల్లో నటిస్తున్నాడు.ఆ చిత్రాలు వచ్చే ఏడ ఆది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.కొత్త సినిమాల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కనుక తెలుగు సినిమాల్లో సూపర్‌ స్టార్‌ వార్తలు పుకార్లే అంటూ తేలిపోయింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Super Star Mohan Lal No Telugu Movies Related Telugu News,Photos/Pics,Images..

footer-test