కృష్ణ గారి అబ్బాయి నుండి సూపర్ స్టార్ మహేష్ జర్నీ... మహేష్ ని సూపర్ స్టార్ ని చేసిన సినిమాలు ఇవే..  

Super Star Mahesh Journey From Krishna Giri Abbai ... Movies Made By Mahesh Superstar-journey,krishna Gari Abbai,mahesh,movie Updates,movies,srikanth Addala,super Star,మహేష్‌

మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. ఆయనకి అటు మాస్ లోను ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకి కేవలం హిట్ టాక్ వస్తే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ మహేష్ సినిమాకి ఎగబడిపోతారు..

కృష్ణ గారి అబ్బాయి నుండి సూపర్ స్టార్ మహేష్ జర్నీ... మహేష్ ని సూపర్ స్టార్ ని చేసిన సినిమాలు ఇవే..-Super Star Mahesh Journey From Krishna Giri Abbai ... Movies Made By Mahesh Superstar

ఆయన కృష్ణ గారి అబ్బాయిగా ఇండస్ట్రీ కి పరిచయమైనప్పటికి వైవిధ్యమైన కథాంశాలు , తన నటనతో ఆయనకంటూ ఒక గుర్తింపు ని సంపాదించుకున్నాడు. మహేష్ కెరీర్ లో హిట్ లతో పాటు భారీ డిజాస్టర్ లు కూడా ఉన్నాయి. వరుస ప్లాప్ లు పలకరించినప్పుడల్లా భారీ హిట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రప్పించాడు.

కెరీర్ మొదట్లో సొంత ఫ్యాన్ బేస్ లేకుండా కేవలం కృష్ణ గారి అభిమానుల పైన ఆధారపడిన మహేష్ మురారి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్నాడు. తరువాత వచ్చిన ఒక్కడు మహేష్ బాబు కి మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. ఒక్కడు సినిమా లో మహేష్ నటన , యాక్షన్ సీన్లలో ఇంటెన్సిటీ అతడిని స్టార్ హీరో గా నిలబెట్టింది.

త్రివిక్రమ్ , మహేష్ బాబు కలయికలో వచ్చిన అతడు సినిమా ఓవర్సీస్ లో తెలుగు సినిమా మార్కెట్ ని పెంచింది. విదేశాల్లో కోటి రూపాయలు కలెక్ట్ చేసిన తొలి తెలుగు చిత్రంగా అతడు సినిమా నిలిచింది. దానితో పాటు టీవీ లలో ఎక్కువ సార్లు ప్రసారం అయిన చిత్రం కూడా అతడు సినిమానే.

పోకిరి సినిమా విడుదలకు ముందు మహేష్ స్థాయి ఒకలా ఉంటే పోకిరి తరువాత మహేష్ కి అన్ని వర్గాల ఆడియన్స్ నుండి అభిమానులు అయ్యారు. ముఖ్యంగా యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ అందరూ మహేష్ కి ఫ్యాన్స్ అయిపోయారు. పోకిరి సినిమా 2006 లొనే 40 కోట్ల కి పైగా గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తరువాత వరుస ప్లాప్ లతో మహేష్ సినీ కెరీర్ నడిచింది ఆ సమయం లో మహేష్ శ్రీను వైట్ల కలయికలో వచ్చిన దూకుడు చిత్రం మహేష్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. మహేష్ కామెడీ టైం ని పూర్తిగా వినియోగించుకున్న శ్రీను వైట్ల సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దాడు.

దూకుడు సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి మహేష్ కెరీర్ లొనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది..

ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కువ మంది అభిమానులు ఉన్న మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో చేసిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు . ఇందులో విక్టరీ వెంకటేష్ తో స్క్రీన్ పంచుకున్న మహేష్ బాబు మరొకసారి మంచి విజయాన్ని అందుకున్నాడు. బాహుబలి సినిమా విడుదల తరువాత తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది ఆ సమయం లో కొరటాల శివ దర్శకత్వం లో మహేష్ నటించిన సినిమా శ్రీమంతుడు ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా విమర్శకుల దగ్గర నుండి కూడా ప్రసంశలు అందాయి. తరువాత చేసిన బ్రహ్మోస్తవం , స్పైడర్ సినిమాలు మహేష్ బాబు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసాయి.

ఆ సమయం లో మరొకసారి కొరటాల శివ తో పని చేసిన మహేష్ బాబు భారత్ అను నేను లాంటి సినిమా తీసి దాదాపు 150 కోట్ల కి పైగా గ్రాస్ వసూలు చేసాడు..

మహేష్ తన 20 ఏళ్ల సినిమా కెరీర్ లో హిట్ లు ప్లాప్ లు ఎన్నో చూసాడు. అన్నిటికన్నా ముఖ్యంగా కృష్ణ గారి అబ్బాయి గా తెలుగు తెరకు పరిచయం అయి తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ని సంపాదించుకొని తెలుగు లో అగ్రకథనాయకులలో ఒకరిగా నిలిచాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఏప్రిల్ 9 న ఆయన కెరీర్ లో చేసిన 25 వ చిత్రం విడుదల కాబోతుంది…