గల్లా వారసుడు చివరికి ఆ క్రియేట్ డైరెక్టర్ చేతిలో పడ్డాడు  

గల్లా జయదేవ్ కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న శ్రీరామ్ ఆదిత్య. .

Super Star Mahesh Babu Son In Law Introduced With Sri Ram Adithya-galla Jayadev,sri Ram Adithya,super Star Mahesh Babu Son In Law,telugu Cinema,tollywood

టాలీవుడ్ లో నేటి తరం యువ దర్శకులు రొటీన్ కి భిన్నంగా కొత్తదనం ఉన్న కథలతో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అలాంటి దర్శకులతో హీరోలు కూడా కొత్తదనం ఉన్న కథలు చేస్తూ హిట్స్ కొట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య..

గల్లా వారసుడు చివరికి ఆ క్రియేట్ డైరెక్టర్ చేతిలో పడ్డాడు-Super Star Mahesh Babu Son In Law Introduced With Sri Ram Adithya

ఈ యువ దర్శకుడు మొదటి సినిమాతో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో మంచి టాలెంటెడ్ దర్శకుడుగ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అందుకోకపోయిన మళ్ళీ శమంతకమణి అని సినిమాతో ఓ కారు బ్యాక్ డ్రాప్ లో కథని అల్లుకొని మల్టీ స్టారర్ సినిమాని తీసాడు. ఇది కూడా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఊహించని విధంగా కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానితో మరో మల్టీ స్టారర్ తీసే అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమాతో యువ హీరో క్రియేటివిటీ జనాలకి కనెక్ట్ అవ్వక ఫెయిల్ అయ్యాడు. అయితే ఈ సినిమాతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకి ఇద్దరు పెద్ద హీరోలని డీల్ చేయలేకపోయాడు అనే నెగిటివ్ రిమార్క్ వచ్చేసింది.

అయితే దర్శకుడుగా మాత్రం అతని టాలెంట్ ని అందరు గుర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీ రామ్ ఆదిత్య ఏకంగా సూపర్ స్టార్ ఫ్యామిలీకి చెందిన వారసుడుని పరిచయం చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ ని పరిచయం చేసే బాద్యత తీసుకున్నాడు.

గల్లా అశోక్ ఎంట్రీ దిల్ రాజు బ్యానర్ లో ఉండాల్సి ఉన్న ఏవో కారణాల వలన ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. దీంతో ఇప్పుడు గల్లా అశోక్ యువ దర్శకుడు చేతితో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు.