ఉగాదికి కొత్త సినిమా మొదలుపెట్టనున్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు.హిట్ మీద హిట్ కొడుతూ కేవలం తెలుగులోనే వందల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్న హీరోగా మారిపోయాడు.

 Super Star Mahesh Babu New Movie Opening In Ugadi-TeluguStop.com

అతని సినిమా అంటే వంద కోట్ల కలెక్షన్ గ్యారెంటీ అని నిర్మాతలు కూడా ముందే ఫిక్స్ అయిపోతున్నారు.తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకొని ఇప్పుడు కొత్త సినిమా ప్లాన్ లో ఉన్నాడు.

ఇప్పటికే దర్శకుడు పరశురాంకి మహేష్ బాబు గ్రీన్ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓపెనింగ్ ఉగాది రోజు చేయనున్నట్లు తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని తెలుస్తుంది.

అయితే అఫీషియల్ గా మాత్రం ఉగాది రోపు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారని సమాచారం.ఇక ఇందులో హీరోయిన్లుగా ఎవరిని తీసుకుంటారు అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తుంది.

మరో వైపు మహేష్ బాబు చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.ఏది ఏమైనా ఫ్యామిలీ టైం పూర్తి చేసుకొని సూపర్ స్టార్ తన కొత్త సినిమాకి ఉగాదికి శ్రీకారం చుడుతున్నాడనేది మాత్రం వాస్తవం అని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube