సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి లుక్ రివీల్ చేసిన నమ్రత

టాలీవుడ్ లో అమ్మాయిల కలల రాకుమారుడు అంటే వెంటనే ఎవరైనా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెబుతారు.అతని లుక్ సౌత్ లో మిగిలిన హీరోలకి పూర్తి డిఫరెంట్ గా నార్త్ హీరోల స్టైల్ లో ఉంటుంది.

 Super Star Mahesh Babu New Look, Tollywood, Telugu Cinema, South Heroines, Namra-TeluguStop.com

మీసకట్టు లేకుండానే అతను సినిమాలలో కనిపిస్తాడు.అయినా కూడా మహేష్ బాబుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అలాగే అభిమానులు కూడా మహేష్ బాబుని మీసం లేకుండానే చూడటానికి ఇష్టపడతారు.అయితే మహేష్ బాబు కెరియర్ లో మొదటి సారి సర్కారు వారి పాట కోసం డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు.

ఇప్పటి వరకు సినిమాలలో కనిపించని విధంగా అతని లుక్ ఉండబోతుంది.అయితే సర్కారువారి పాట సినిమాలో మహేష్ బాబు ఎలా ఉంటాడు అనేదానికి ఇంకా పూర్తి క్లారిటీ లేకపోయినా అప్పుడప్పుడు మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ పెట్టే ఫోటోలతో మహేష్ కొత్త లుక్ అందరికి తెలిసిపోతుంది.

కోవిడ్ సమయంలో సినిమాలు లేకపోవడంతో సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.ఈ నేపధ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమా షూటింగ్ లు లేకపోవడంతో ఇంటిపట్టునే ఉన్నాడు.

ఈ నేపధ్యంలో కాస్త మీసాలు, గడ్డం పెంచాడు.ఈ లుక్ ని నమ్రత ప్రీ కోవిడ్‌ డైరీస్‌, మహేష్‌ బాబు రేర్‌ పిక్‌ని ఆమె షేర్‌ చేసింది.

థాయ్‌లాండ్‌లోని కమలాయ రిసార్ట్, అందులోని స్పా అంటే మహేష్‌ బాబుకు ఎంతో ఇష్టమని తెలుపుతూ కరోనాకి ముందు సమ్మర్‌ వెకేషన్‌కి వెళ్లినప్పటి ఫొటోని నమ్రతా తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది.ఈ ఫొటోలో మహేష్‌ బాబుని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఇలాంటి మీసకట్టుతో మహేష్ బాబు సర్కారువారి పాట సినిమాలో కనిపిస్తాడని టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube