సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మహేష్ న్యూ లుక్

టాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే టక్కున సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెబుతారు.అమ్మాయిల కలల రాకుమారుడుగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి యూత్ లో మాస్ ఫాలోయింగ్ ఎంత ఉంటుందో అదే స్థాయిలో అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఉంటుంది.

 Super Star Mahesh Babu New Handsome Look Viral, Lock Down, Corona Effect, Super-TeluguStop.com

ప్రతి అమ్మాయి తనకి కాబోయే వాడు మహేష్ బాబులా అందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటుంది.వయసు పెరుగుతున్న కొద్ది హీరోలలో అందం తగ్గిపోతూ ఉంటుంది.

కాని సూపర్ స్టార్ మహేష్ బాబుకి మాత్రం వయసుతో పాటు అందం కూడా పెరిగిపోతుంది.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రారంభంలో మిల్క్ బాయ్ లా ఉన్నా కూడా మహేష్ లో అందం అయితే పెద్దగా ఉండేది కాదు.

కాని అతను ప్రతి సినిమాకి కొత్తగా అందంగా తయారవుతూ ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్లీ కెమెరా ముందుకొచ్చారు.

అయితే అది సినిమా షూటింగ్ కాదు.ఓ యాడ్ ఫిలిం షూటింగ్ కోసం మహేష్ సెట్స్ మీదకు వచ్చారు.ఈ యాడ్ ను నేషనల్ లెవెల్ యాడ్ ఫిలింమేకర్ అవినాశ్ గోవారికర్ రూపొందించారు.ఈ సందర్భంగా షూట్ ముగిసిన తర్వాత గోవారికర్ మహేష్ బాబును ఫొటోలు తీశారు.

వాటిలో కళ్లుచెదిరే రీతిలో స్టన్నింగ్స్ లుక్స్ తో ఉన్న ఒక ఫొటోను గోవారికర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.దీనిపై మహేష్ బాబు వ్యాఖ్యానిస్తూ మళ్లీ పనిలో దిగడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

అయితే ఈ ఫోటోలలో మహేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడనే విషయం కంటే అతని అందం అందరిని భాగా ఆకర్షించింది.లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉండి మహేష్ బాబు మరింత అందంగా మారిపోయాడని ఇప్పుడు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అమ్మాయిలు అయితే ఈ ఫోటోని తమ సోషల్ మీడియా ప్రొఫైల్ డీపీగా మార్చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube