'ఫ్యామిలీ మ్యాన్ 3' లో టాలీవుడ్ సూపర్ స్టార్.. ఒప్పుకుంటాడా ?

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.ఈ మధ్యనే సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Super Star Mahesh Babu In Family Man Season 3-TeluguStop.com

మొదటి సీజన్ కన్నా ఇంకా సూపర్ హిట్ టాక్ తో ఈ వెబ్ సిరీస్ దూసుకుపోతుంది.ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

రెండు సీజన్స్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు సీజన్ 3 కూడా స్టార్ట్ చేయాలనీ అమెజాన్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

 Super Star Mahesh Babu In Family Man Season 3-ఫ్యామిలీ మ్యాన్ 3’ లో టాలీవుడ్ సూపర్ స్టార్.. ఒప్పుకుంటాడా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండు సీజన్స్ లో మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

అయితే సౌత్ లో కూడా ఈ వెబ్ సిరీస్ పై ఇంట్రెస్ట్ తీసుకురావడానికి మొదటి సీజన్ లో సందీప్ కిషన్, రెండవ సీజన్ లో సమంతను కీలక పాత్రల్లో తీసుకున్నారు.రెండవ సీజన్ లో సమంత నటించడం వల్ల ఈ వెబ్ సిరీస్ సౌత్ లో మరింత పాపులర్ అయ్యింది.

ఇందులో సమంత నటనకు అందరి ప్రశంసలు దక్కాయి. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.అందుకే ఇప్పుడు మూడవ సీజన్ లో కూడా టాలీవుడ్ నుండి ఎవరో ఒకరిని తీసుకోవాలని అనుకుంటున్నారట.అయితే ఈసారి ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకోవాలని చూస్తున్నారట.

ఆయనను ఎలాగైనా ఒప్పించాలని రాజ్ అండ్ డీకే అనుకుంటున్నట్టు టాక్.

Telugu Mahesh Babu, Raj And Dk, Super Star Mahesh Babu In Family Man Season 3, The Family Man 3, Web Series-Movie

అయితే మహేష్ బాబు ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.వెండితెర మీద కనిపించడానికే మహేష్ బాబుకు ఖాళీ లేదు అలాంటిది ఓటిటి లో కనిపించడానికి ఒప్పుకోడని మిగతావారు అభిప్రాయ పడుతున్నారు.అయితే మహేష్ బాబు ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకుంటే అది సంచలనం అనే చెప్పాలి.

అయితే రాజ్ అండ్ డీకే మహేష్ బాబు ఒప్పుకోక పోయిన టాలీవుడ్ లో ఎవరో ఒక స్టార్ ను మాత్రం తీసుకుంటారని తెలుస్తుంది.

#Web Series #Mahesh Babu #Raj And DK #SuperStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు