స్టార్ హీరో మహేష్ బాబు ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు 46వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.కృష్ణ నట వారసుడైన మహేష్ బాబు ఎలాంటి పాత్రలోనైనా నటించగల టాలెంట్ ఉన్న నటుడు కావడం గమనార్హం.

 Super Star Mahesh Babu First Remuneration Details Here,latest News Tollywood New-TeluguStop.com

శ్రీమంతుడు సినిమాలో ఊరిని దత్తత తీసుకున్న మహేష్ రియల్ లైఫ్ లో కూడా బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా మహేష్ అడుగులు వేస్తున్నారు.

Telugu Lakhs Rupees, Heart, Mahesh Babu-Movie

ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి మహేష్ అందరి చేత ప్రశంసలను అందుకుంటున్నారు.తెలుగు రాష్ట్రల్లో ప్రజలకు ఇబ్బందులు ఎదురైన సమయంలో మహేష్ బాబు తన వంతుగా ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ గొప్ప మనస్సును చాటుకుంటున్నారు.ఎన్నో ప్రముఖ కంపెనీలకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

హ్యాండ్సమ్ హీరోగా పేరును సంపాదించుకున్న మహేష్ బాబు ఇతర భాషల సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన వ్యక్తే కావడం గమనార్హం.యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో సైతం మహేష్ బాబుకు భారీగా క్రేజ్ ఉంది.

త్వరలో సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో కూడా నటించబోతున్నారు.మహేష్ బాబు ఒక్కో బ్రాండ్ ఎండార్స్ మెంట్ కొరకు 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Telugu Lakhs Rupees, Heart, Mahesh Babu-Movie

మహేష్ బాబు బాలనటుడిగా చాలా సినిమాలు చేసినా రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన రాజకుమారుడు మహేష్ కు నటుడిగా తొలి సినిమా అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా కొరకు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకున్నారు.ప్రస్తుతం మహేష్ బాబు రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువమొత్తంగా ఉంది.మహేష్ బర్త్ డే కానుకగా విడుదలైన సర్కారు వారి పాట టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube