టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సినిమాకి మధ్యలో కొంత టైం ఫ్యామిలీకి కేటాయిస్తాడు.అందరి హీరోలాల ఎక్కువగా బయట తిరగకుండా షూటింగ్ అయిపోతే నేరుగా ఇంటికి వచ్చి కుటుంబంతో గడుపుతాడు.
నమ్రత లాంటి స్టార్ హీరోయిన్ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గైడెన్స్ తో సూపర్ స్టార్ స్టొరీ సెలక్షన్స్ మార్చుకొని సూపర్ హిట్స్ కొడుతూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.ఇక బాలీవుడ్ నుంచి వచ్చిన నమ్రత పూర్తిగా ఫ్యామిలీ విమెన్ గా మారిపోయింది.
ఇక మహేష్ బాబు తన ప్రతి సినిమా రిలీజ్ తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్తాడు.అక్కడ వారం, పది రోజులు జాలీగా గడుపుతాడు.
తరువాత ఇండియా వచ్చి కొత్త సినిమా పనిలో పడతాడు.
ఈ నేపధ్యంలోనే సరిలేరు నీకెవ్వరు సూపర్ సక్సెస్ తర్వాత ఫ్యామిలీతో కలిసి అమెరికా ట్రిప్ కి మహేష్ బాబు వెళ్ళిపోయాడు.
వీటికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలో గౌతమ్–సితార క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి.
రెడ్ జర్కిన్ లో ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్న గౌతమ్ ని మహేష్ ఫోటో తీస్తున్నాడు.మరోవైపు ఆ ఇద్దరి ముందు సితార ఎంతో లవ్ లీగా తన కోట్ లోకి దూరిపోతోంది.
ఈ ఫోటో చూడగానే ఎంతో ఫన్నీగా లవ్ లీగా ఉంది.ఈ ఫోటోని నమ్రత ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.ఫ్యామిలీ ట్రిప్ తో తాము ఎంత ఉత్సాహంగా టైం స్పెండ్ చేసారో చెప్పే హ్యాపీ మూమెంట్ ని ఇలా ఫ్యాన్స్ తో పంచుకుంది.