సక్సెస్ మీట్ లో తనలో మరో కోణం చూపించిన మహేష్ బాబు  

Super Star Mahesh Babu Exciting Speech About Maharshi Movie Success -

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అందరికి వెంటనే గుర్తుకొచ్చేది సైలెంట్ గా ఉంటూ తన పనిని తాను సైలెంట్ గా చేసుకొని పోయే స్టార్ హీరో వ్యక్తిత్వం కనిపిస్తుంది.అయితే అతనిలో కూడా హ్యూమర్, ఎమోషనల్ యాంగిల్ ఉందని అప్పుడప్పుడు మహేష్ ని చూస్తూ ఉంటే కనిపిస్తుంది.

Super Star Mahesh Babu Exciting Speech About Maharshi Movie Success

సినిమా అయిపోయిన వెంటనే భార్య, పిల్లలతో వెకేషన్ కి వెళ్లి హ్యాపీగా తిరిగి వచ్చే మహేష్ బాబు ఈ మధ్య కాలంలో సినిమా సక్సెస్ మీట్ లో మనసు విప్పి మాట్లాడుతున్నాడు.మొదట్లో అంతగా ఎవరితో కలవని మహేష్ తన గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మహర్షి సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ లో సినిమా గురించి మహేష్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.తన 25 సినిమాల ప్రస్తానంలో ఎంతో ప్రత్యేకం అందులో మహర్షి సినిమా ఇంకా ప్రత్యేకం.

ఈ సినిమా తన మనసుకి దగ్గరైన కథ.ఈ సినిమా కథ మొదట దిల్ రాజు గారు విని క్లాసిక్ అవుతుందని అన్నారు, తరువాత దత్ గారు కూడా ఈ సినిమా తన డబల్ ప్రమోషన్ ఇస్తుందని అన్నారు.ఇప్పుడు చూస్తుంటే సినిమా కి వస్తున్నా స్పందన తనకి ఎంతో ఆనందం కలిస్తుంది.ఇలాంటి సినిమా ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది.ఈ సినిమా తనకి ఓ గొప్ప సినిమా అని కాలర్ ఎగరేసి చెబుతున్న అంటూ ఫ్యాన్స్ కి ఉత్సాహం గా చెప్పడం ఆసక్తి కలిగించింది అని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు