Hero Harnath krishna : కష్టాల్లో ఉన్న ఆ స్టార్ హీరోను ఆదుకున్న కృష్ణ.. గొప్ప మనస్సు అంటూ?

సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తర్వాత ఆయన గొప్పదనం గురించి ఇండస్ట్రీలో కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.ఎంతోమంది నిర్మాతలు ఇండస్ట్రీలో విజయవంతంగా కెరీర్ ను కొనసాగించారంటే అందుకు కృష్ణ కారణమని చాలామంది భావిస్తారు.

 Super Star Krishna Greatness Details Here Goes Viral , Super Star Krishna, Haran-TeluguStop.com

కష్టాల్లో ఉన్న ఎంతోమందిని కృష్ణ ఆదుకున్నారు.ఇండస్ట్రీలో మంచి మనస్సు ఉన్న హీరోలలో ఒకరిగా కృష్ణ నిలిచారు.

సీనియర్ హీరో హరనాథ్ కూడా కృష్ణ సహాయాన్ని పొందిన వాళ్లలో ఒకరు.

హరనాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోగా రొమాంటిక్ హీరోగా కూడా హరనాథ్ కు మంచి పేరు ఉంది.

అయితే తర్వాత రోజుల్లో హరనాథ్ మద్యానికి బానిస కావడంతో ఆయనకు సినీ ఆఫర్లు తగ్గాయి.మద్యం అలవాటు వల్ల హరనాథ్ కు మూవీ ఆఫర్లు సైతం అంతకంతకూ తగ్గాయి.

సినిమాల్లో ఛాన్స్ లు లేకపోవడంతో హరనాథ్ ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Telugu Haranath, Krisha, Senior Harnath, Krishna, Tollywood-Movie

చేతిలో డబ్బులు లేకపోవడంతో హరనాథ్ తనకు సన్నిహితులలో ఒకరైన కృష్ణను కలవడం జరిగింది.సిబ్బంది ద్వారా హరనాథ్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న కృష్ణ కొన్నిరోజులు హరనాథ్ ను తన ఇంట్లోనే ఉండాలని సూచించడంతో పాటు ఆయనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు.ఆ తర్వాత కృష్ణ హరనాథ్ కు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి ఆయనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు.

Telugu Haranath, Krisha, Senior Harnath, Krishna, Tollywood-Movie

కృష్ణ సన్నిహితులలో అతికొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు.కృష్ణ సైతం తాను హరనాథ్ కు చేసిన సహాయాన్ని ఎక్కడా వెల్లడించలేదంటే ఆయన మనస్సు ఎంత మంచి మనస్సు అనే విషయం సులువుగానే అర్థమవుతుంది.ఈ విధంగా కృష్ణ ఎంతోమందికి సహాయం చేసినా ఆ సహాయాల గురించి వెల్లడించడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు.కృష్ణ మరణ వార్త విని తట్టుకోలేకపోతున్నామని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube