కృష్ణ కెరీర్ లో బెస్ట్ మూవీ చుట్టాలున్నారు జాగ్రత్త.. !

సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ చుట్టాలున్నారు జాగ్రత్త.ఈ సినిమా విడుదలై 40 ఏండ్లు నిండాయి.

 Super Star Krishna Best Movie Chuttaalunnaru Jagratha , Superstar Krishna, Chuttaalunnaru Jagratha , Nandamuri Natasimham Balayya, Sridevi, Geeta, Bv Prasad, Ms Vishwanath, Tollywood-TeluguStop.com

ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఈ సినిమాను నందమూరి నటసింహం బాలయ్య నిర్మించాడు.

అమృతా ఫిలిమ్స్ బ్యానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించాడు.సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఈ సినిమా 167వ చిత్రంగా రూపొందింది.

 Super Star Krishna Best Movie Chuttaalunnaru Jagratha , Superstar Krishna, Chuttaalunnaru Jagratha , Nandamuri Natasimham Balayya, Sridevi, Geeta, BV Prasad, MS Vishwanath, Tollywood-కృష్ణ కెరీర్ లో బెస్ట్ మూవీ చుట్టాలున్నారు జాగ్రత్త..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాకు బాలయ్య సమర్పకుడిగా కూడా వ్యవహరించాడు.

చుట్టాలున్నారు జాగ్రత్త సినిమాలో కృష్ణ సరసన శ్రీదేవి, గీత హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమాలో కృష్ణ డబుల్ రోల్స్ పోషించాడు.ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా కాన్సెప్ట్‌ తో తెలుగులో పలు సినిమాలు తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్నాయి.ఈ సినిమా తమిళంలో రజనీకాంత్ హీరోగా పొక్కిరి రాజా పేరుతో రీమేక్ అయ్యింది.

తమిళంలోనూ హీరోయిన్ గా శ్రీదేవి నటించింది.కవిత పాత్రను రాధిక పోషించింది.

అటు ఈ సినిమాను హిందీలో మవాలీ పేరుతో రీమేక్ అయ్యింది.జితేంద్ర హీరోగా నటించాడు.

ఈ సినిమాలో జయప్రద, శ్రీదేవి హీరోయిన్లుగా నటించారు.అయితే ఇందులో కవిత పాత్రను శ్రీదేవి చేయడం విశేషం.

Telugu Bv Prasad, Geeta, Krishna, Vishwanath, Sridevi, Tollywood-Telugu Stop Exclusive Top Stories

కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రానికి ఎం.ఎస్.విశ్వనాథ్ చక్కటి బాణీలు అందించారు.ఈ సినిమాలో కీ రోల్స్ లో రావు గోపాల రావు, నూతన ప్రసాద్, సూర్యకాంతం నటించారు.

అప్పట్లో ఈ సినిమా అన్ని సెంటర్లలో రికార్డులను బ్రేక్ చేసింది.సంచలన విజయాన్ని అందుకుంది.సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో చుట్టాలున్నారు జాగ్రత్త టాప్ లో నిలిచింది.ఈ సినిమా కృష్ణతో పాటు పలువురు హీరోయిన్లకు, బాలయ్యకు చక్కటి పేరు తెచ్చింది.

ఈ సినిమా తర్వాత కృష్ణకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.తన కెరీర్ మంచి స్వింగ్ లోకి మారింది.

ఈ సినిమా తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో మంచి విజయాలు అందుకున్నాడు కృష్ణ.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube