వావ్ సీతూ పాప.. మేనత్త కోరిక తీర్చాలమ్మా!

సూపర్ స్టార్‌ కృష్ణ కూతురు మంజుల గతంలో హీరోయిన్ గా నటించాలని చాలా ప్రయత్నించింది. ఆమె తండ్రి కృష్ణ కూడా ఓకే అన్నారు.

 Super Star Fans Want Sitara Act As Heroine In Telugu Films-TeluguStop.com

కాని ఆయన అభిమానులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు.ఎట్టి పరిస్థితుల్లో మంజుల సినిమా ల్లో నటించకూడదు అంటూ వ్యతిరేకించారు.

చివరకు అభిమానుల వ్యతిరేకత కారణంగా మంజుల సినిమా ల్లో హీరోయిన్ గా నటించాలనే కోరిక ఉన్నా కూడా నెరవేరకుండానే పోయింది.ఆమె సినిమా లపై ఉన్న కోరికతో నిర్మాతగా మరియు దర్శకురాలిగా కంటిన్యూ అయ్యింది.

 Super Star Fans Want Sitara Act As Heroine In Telugu Films-వావ్ సీతూ పాప.. మేనత్త కోరిక తీర్చాలమ్మా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని సినిమాల్లో కనిపించి అలా తన కోరిక కొంతలో కొంత అయినా తీర్చుకునే ప్రయత్నం చేసింది.ఇన్నాళ్ల తర్వాత ఘటమనేని అదే అభిమానులు ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ ను కోరుకుంటున్నారు.

మహేష్‌ బాబు కూతురు సితార సోషల్ మీడియా సెన్షేషన్‌.ఆమె ఏం చేసినా కూడా అభిమానులు ఫిదా అవుతూ ఉంటారు.ఆమె చేసిన ప్రతి పని కూడా ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు.ఆమె సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు అదే ఆమెను హీరోయిన్ గా నటింపజేయాలని అభిమానులు కోరుకునేలా చేస్తుంది.చిన్నారి సితార పెరిగి పెద్ద అవుతోంది.

దాదాపుగా పదేళ్ల వయసు కు వచ్చిన సితార రెగ్యులర్‌ గా తన ఫొటో షూట్‌ లను లేదా ఫన్నీ వీడియోలను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ప్రస్తుతం ఆమె చేస్తున్న సోషల్‌ మీడియా ఫొటోలు చూస్తుంటే సితార అప్పుడే ఇంత పెద్దగా అయ్యిందా అనిపిస్తుంది.మరో నాలుగు అయిదు సంవత్సరాల్లో ఏకంగా హీరోయిన్ గా నే నటించే అవకాశం ఉంది కదా అంటున్నారు.మరో వైపు సితారను ఇప్పటి నుండే బాల నటిగా కొందరు వెండి తెరపై చూడాలని కోరుకుంటున్నారు.

మరి అది ఎంత వరకు సాధ్యమో తెలియడం లేదు.కాని అభిమానులు మాత్రం సితార తన మేనత్త మంజుల కోరిక తీర్చేలా హీరోయిన్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు.

#Sitara #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు