మీ గుండె స్కాన్ చేసే వాచ్ ఇదే తెలుసా.. సూప‌ర్ స్పెషాలిటీస్‌

ప్ర‌స్తుతం జీవ‌న విధానం అంతా ఉరుకు ప‌రుగులే అయిపోయింది.ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి ప‌డుకునే వ‌ర‌కు అంతా టెన్ష‌న్ టెన్ష‌న్‌గానే జీవించాల్సి వ‌స్తోంది.

 Super Specialities Heart Scanning Watch-TeluguStop.com

కొంద‌రిది పేరు కోసం ఆరాటం.మ‌రి కొంద‌రిది డ‌బ్బు కోసం పోరాటం.

మ‌రి కొంద‌రికి స్టేట‌స్‌, ప‌ద‌వులు కోసం పాకులాట‌.ఇలా ఎవ‌రిని చూసినా ఏదో ఒక టెన్ష‌న్‌తోనే ఉంటున్నారు.

 Super Specialities Heart Scanning Watch-మీ గుండె స్కాన్ చేసే వాచ్ ఇదే తెలుసా.. సూప‌ర్ స్పెషాలిటీస్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఉరుకు ప‌రుగుల జీవితానికి క‌రోనా చాలా వ‌ర‌కు బ్రేక్ వేసింద‌నే చెప్పాలి.ఇలాంటి ఒత్తిడి జీవితంలో ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఆరోగ్యం ప‌ట్ల ఎంతో జాగ్ర‌త్త‌తో ఉండాలి.

వ్యాయామంతో పాటు స‌రైన ఆహారం టైంకు తీసుకోవ‌డం చేయాలి.

ఈ టైంలో ఆరోగ్యాన్ని సూచించే యాప్‌ల‌తో పాటు ఉప‌క‌ర‌ణాల‌కు మంచి గిరాకీ ఏర్ప‌డింది.

మార్కెట్లో ఇప్పుడు వీటిని బాగా కొంటున్నారు.ఈ క్ర‌మంలోనే మ‌న గుండె ప‌రిస్థితి ఎలా ఉందో స్కాన్ చేసే వాచ్ ఒక‌టి ప్ర‌పంచ వ్యాప్తంగా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది.

ఫ్రాన్స్‌కు చెందిన ఎల‌క్ట్రిక‌ల్ ఉత్ప‌త్తి కంపెనీ ఒక్క‌టి స్కాన్ వాచ్ పేరుతో ఓ వాచ్‌ను మార్కెట్లోకి తీసుకువ‌చ్చింది.ఇది చూడ‌డానికి మాత్రం సాధార‌ణ వాచ్‌లాగా క‌నిపిస్తున్నా ఇందులో ఎన్నో ర‌కాల అడ్వాన్స్‌డ్ హెల్త్ మానిట‌రింగ్ ఫీచ‌ర్లు ఉన్నాయ‌ని వెల్ల‌డించింది.

ఈ స్కాన్ వాచ్‌లో ప‌రిక‌రాలు ఎలా ప‌నిచేస్తాయో చూద్దాం.వాచ్ కింది భాగంలో మూడు ఎలక్ట్రోడ్లు ఉంటాయి.ఇవి వాచ్ ధ‌రించిన వ్య‌క్తి యొక్క మెడికల్ గ్రేడ్ ఈసీజీ, పల్స్‌ ఆక్సీమీటర్‌తో పాటు 24 గంట‌లు హార్ట్ రేట్‌ను మానిట‌రింగ్ చేస్తూ ఉంటాయి.ఈ గ‌ణాంకాలు అన్ని డిస్ ప్లేలో సూచిస్తాయి.

ఇక కొన్ని ల‌క్ష‌ణాల‌ను ఈ స్కాన్ వాచ్ ముందే గుర్తిస్తుంది.నిద్ర‌లేమి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు, ప‌క్ష‌వాతానికి ముందు వ‌చ్చే క‌ర్ణిక ద‌డ ల‌క్ష‌ణాలు గుర్తించి వెంట‌నే వార్నింగ్ ఇస్తుంది.
ఇక మ‌నం రోజూ ఎన్ని అడుగులు వేశాం.ఆరోగ్యం కోసం ఇంకా ఎన్ని అడుగులు వేయాలి ?  ఎంత దూరం ప్ర‌యాణించాం ?  ఎన్ని ఫ్లోర్లు ఎక్కామ‌న్న‌ది కూడా ఈ వాచ్ సూచిస్తుంది.ఒక్క‌సారి రీచార్జ్ చేస్తే మొత్తం 30 రోజుల పాటు ప‌ని చేస్తుంది.ఫ్రాన్స్‌లో 279 యూరోలో ఉన్న ఈ వాచ్ ధ‌ర మ‌న క‌రెన్సీలో రు.25 వేలు.ఇది భార‌త మార్కెట్లోకి త్వ‌ర‌లో వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయి.

#Busy Schedule #France #Heart Problems #Health #HeartScanning

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు