ఆహా అనిపించే అల్లు అరవింద్ ఆలోచన.. అందరూ కలవడమే అసలు సమస్య..

ఆహా.తెలుగులో సత్తా చాటుతున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్.

 Super Powee Brain Of Allu Aravind-TeluguStop.com

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఈ సంస్థ.ఇంతింతై.

వటుడింతై అన్న చందంగా మారిపోయింది.నెమ్మదిగా మొదలైన ఆహా ప్రస్థానం అచిర కాలంలోనే ఆహా అనే స్థాయికి చేరింది.

 Super Powee Brain Of Allu Aravind-ఆహా అనిపించే అల్లు అరవింద్ ఆలోచన.. అందరూ కలవడమే అసలు సమస్య..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా లాక్ డౌన్ ఈ ఫ్లాట్ ఫామ్ కు బాగా కలిసి వచ్చింది.ఆహాకు ఓ రేంజిలో గ్రాఫ్ పెరిగింది.

ప్రస్తుతం ఈ ఓటీటీ తెలుగు జనాలకు ఓ రేంజిలో ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది.అంతేకాదు.

అల్లు అరవింద్ ఓ ప్రత్యేక టాక్ షోను రూపొందించేందుకు రెడీ అవుతున్నాడట.ఈ షోకు హోస్టుగా నందమూరి నటసింహం బాలయ్యను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఆయన తొలుత మంచు కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు సమాచారం.ఇందులో మోహన్ బాబుతో పాటు.

విష్ణు, మనోజ్, లక్ష్మి కలిసి పాల్గొంటారు.

అటు ఇదే షోకు చిరు ఫ్యామిలీని కూడా ఆహ్వానించేందుకు అరవింద్ ప్రయత్నిస్తున్నాడట.

చిరంజీవి, రాంచరణ్, సురేఖ, ఉపాసన ఈ షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అటు బాలయ్యతో చిరంజీవికి రాజకీయ విభేధాలున్నాయి.అటు మోహన్ బాబుతో కూడా బాలయ్యకు చిన్న చిన్న గొడవలు ఉన్నాయి.ఈ టాక్ షోతో వారి మధ్య ఉన్నఅగాథానికి బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఖైదీ నెంబర్ 150, గౌతమీ పుత్ర శాతకర్ణి వివాదంతో పాటు మా ఎన్నికల వివాదం కూడా ఈ షోతో అంతమయ్యే అవకాశం ఉంది.

Telugu Aha, Akhil, Akkineni Family, Allu Aravind, Naga Chaitanya, Super Powee Brain Of Allu Aravind, Tollywood-Movie

అటు తెలుగు సినిమా పరిశ్రమలోనే మరో టాప్ ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం ఉంది.అయితే నాగార్జునతో కూడా బాలయ్యకు చిన్న చిన్న వివాదాలున్నాయి.ఇద్దరు ఏ వేడుకలోనూ మాట్లాడుకున్నట్లు కనిపించలేదు.

అయితే నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ షోలో పాల్గొనేలా అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ షో ఎప్పుడు మొదలవుతుంది? అందరూ ఒకే వేదిక మీద కలువ గలుగుతారా? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

#PoweeBrain #Akkineni Family #Akhil #Naga Chaitanya #Allu Aravind

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు