అమ్మ గా మారిన కూడా అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన సూపర్ మామ్స్ వీరే..!

ప్రపంచానికి ప్రేమను పంచే అమ్మకు అందులోనూ క్రీడలను ఎంచుకున్నవారికి కొంచెం ఎక్కువే అవకరోధాలు ఉంటాయి.అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా క్రీడల్లో రాణించిన అమ్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Super Moms Who Have Become Mothers And Also Excelled In International Sports , M-TeluguStop.com

భారత బాస్కెట్ బాల్ జట్టు మాజీ కెప్టన్ అయిన అనిత పాల్‌దురై ఏసియన్ బాస్కెట్ బాల్ కాన్ఫెడరేషన్ చాంపియన్‌షిప్స్‌లో వరుసగా 9 సార్లు పాల్గొన్న ఏకైక, మొదటి మహిళగా పేరొగాంచింది.తమిళనాడుకు చెందిన అనిత 2013లో ఒక బిడ్డకు తల్లైన తర్వాత కూడా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి ఫిట్‌నెస్ సాధించి తిరిగి బాస్కెట్ బాల్ కోర్టులోకి అడుగు పెట్టింది.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గ్రాండ్ స్లామ్ సాధించిన ఏకైక భారత మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.ఒక బాబుకు తల్లైన తర్వాత బరువు తగ్గి మళ్లీ ప్రాక్టీన్ మొదలు పెట్టింది.

భారత చెస్ చరిత్రలో రెండో మహిళా గ్రాండ్ మాస్టర్‌గా రికార్డులకు ఎక్కిన కోనేరు హంపి 2006 ఏషియన్ గేమ్స్‌లో రెండు స్వర్ణపతకాలు సాధించింది.పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లైన తర్వాత 2019లో సర్క్యూట్‌లోకి అడుగుపెట్టింది.

లైట్ వెయిట్ కేటగిరీలో ప్రొఫెషనల్ బాక్సర్ అయిన సరితా దేవి 2005 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం, ఆ మరుసటి ఏడాదే స్వర్ణ పతకం సాధించి అందరినీ ఆశ్చర్యపరిమింది.పెళ్లై కొడుకు పుట్టిన తర్వాత ఏషియన్స్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో వెండి పతకాలు సాధించింది.

భారత హై జంప్ కేటగిరీలో జాతీయ రికార్డు సృష్టించిన సహాన కుమారి 2012 ఒలింపిక్స్‌లో పాల్గొన్నది.ఆమె ఒలంపిక్స్‌లో పాల్గొనే సమయానికే ఒక అమ్మాయికి తల్లి.భారత స్టార్ రెజ్లర్ మేరీ కోమ్ టోక్యో 2012 ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.పెళ్లి చేసుకొని నలుగురు పిల్లలను కన్న తర్వాత కూడా బాక్సర్‌గా రాణిస్తూనే ఉన్నది.

డిస్కస్ త్రోలో అనేక రికార్డులు నెలకొల్పిన కృష్ణ పూనియ 2010లో కామన్వెల్స్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించింది.బాబు పుట్టిన తర్వాత కూడా భర్త ప్రోత్సాహంతో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూనే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube