సూపర్ మార్కెట్ లో దొంగతనం చేయాలనీ వచ్చిన ఆ జంట చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరు.!       2018-07-02   23:40:52  IST  Raghu V

సూపర్ మార్కెట్ లో బిల్ వేసే అమ్మాయిని మాటల్లో పెట్టి డబ్బులు ఇచ్చినట్టే మళ్లీ తీసేసుకుని మోసం చేయటం సినిమాల్లో చూసుంటాము. కానీ ఎంత దొంగతనం చేయాలనీ చూసినా సింపుల్ గా ఎదో ఒక కెమెరా కి చిక్కడం కాయం. ఎందుకంటే ప్రస్తుతం సీసీ టీవీలో అన్నిచోట్లా అమర్చారు. మన దేశంలో అంత భద్రతగా ఉంది అంటే ఇక విదేశాల గురించి కొత్తగా చెప్పనవసరంలేదు అనుకుంట. కానీ కెనడాలో ఓ జంట సూపర్ మార్కెట్ లో దొంగతనం చేయాలనుకున్నారు. అయితే వారు చోరీ చేయడం మాట అటుంచి, ఈ ఘటన కామెడీ సినిమాలా మారిపోయింది.

కెనడాలోని ఎడ్మెంటన్ ప్రాంతంలోఈ ఘటన చోటుచేసుకుంది. ఓ జంట సోర్ట్‌కు వచ్చి పాప్‌కార్న్ తీసుకున్నారు. అయితే స్టోర్ ఓనర్‌కు వారిపై అనుమానం వచ్చింది. దీంతో ఆ దంపతులిద్దరూ భయపడిపోయారు. భర్త తన షర్టును కూడా వదిలేసి పారిపోగా, భార్య పైనున్న ర్యాక్‌పైకి ఎక్కేసింది. అయితే అది విరిగిపోవడంతో అమాంతం కింద పడిపోయింది. ఎట్టకేలకు పోలీసులు వీరిరువురినీ పట్టుకున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూసినా వారు తెగ నవ్వుతున్నారు.