హీరో, హీరోయన్ కాంబో.డైరెక్టర్, హీరో కాంబో.
హీరో, మ్యూజిక్ డైరెక్టర్ కాంబో అంటే ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది.ఈ కాంబినేషన్ లో చాలా వరకు రిపీట్ అయి.కంటిన్యూగా సక్సెస్ సాధించిన వాళ్లు ఉన్నారు.సేమ్ ఇలాగే కొందరు దర్శకులు, నిర్మాణ సంస్థల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.
వారి కాంబోలో సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ అనే ముద్ర పొందాయి.ఇంతకీ ఆ డైరెక్టర్- ప్రొడక్షన్ హౌస్ కాంబోలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
త్రివిక్రమ్- హారిక & హాసిన్ క్రియేషన్స్
వీరి కాంబినషన్లో పలు సినిమాలు రూపొంది సక్సెస్ అయ్యాయి.జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, అరవింద సమేత, అల వైకుంఠపురంలో రూపొందాయి.ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమా తెరకెక్కుతోంది.
మారుతి- యువి క్రియేషన్స్
వీరి కాంబినేషనన్ లో భలె భలే మగాడివోయ్, ప్రతిరోజు పండుగే, మహానుభావుడు సినిమాలు వచ్చాయి.
అనిల్ రావిపూడి- శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
వీరి దర్శకత్వంలో సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్-2, సరిలేరు నీకెవ్వరు సినిమాలు రూపొందాయి.
కెవి రెడ్డి- విజయ ప్రొడక్షన్స్
వీరి కాంబినేషన్ లో పాతాల భైరవి, మాయా బజార్, జగదేక వీరుడి కథ సినిమాలు వచ్చాయి.
ఎల్వీ ప్రసాద్- విజయ ప్రొడక్షన్స్
షావుకారు, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, పెళ్లిచేసి చూడు సినిమాలు వచ్చాయి.
కోడి రామక్రిష్ణ- మల్లెమాల ప్రొడక్షన్స్
ఈ కాంబినేషన్ లో అమ్మోరు, అంజి, అరుంధతి, అంకుశం సినిమాలు తెరకెక్కాయి.
కె.విశ్వనాథ్- పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్
శుభసంకల్పం, సిరిసిరి మువ్వ, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వంయం క్రుషి, అపద్భాందవుడ సినిమాలు వచ్చాయి.
కే.రాఘవేంద్రరావు- వైజయంతి మూవీస్
జగదేకవీరుడు అతిలోక సుందరి, రాజ కుమారుడు, పెళ్లి సందడి సినిమాలు తెరకెక్కాయి.
రవిబాబు- సురేష్ ప్రొడక్షన్స్
ఈ కాంబినేషన్ లో అవును, అవును-2 సినిమాలు వచ్చాయి.
కోదండరామిరెడ్డి- క్రియెటివ్ కమర్షియల్స్
ఈ కాంబినేషన్ లో చాలెంజ్, అభిలాష, రాక్షసుడు సినిమాలు తెరకెక్కాయి.