సూపర్‌హిట్‌ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’ ... వరల్డ్ టెలివిజన్‌ ప్రీమియర్‌గా మీ జీ తెలుగులో

జీ తెలుగు తమ అభిమాన ప్రేక్షకుల కోసం రొమాంటిక్ మరియు కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’ వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ప్రసారం చేయబోతోంది.ఒరేయ్ బుజ్జిగా సినిమా డిసెంబర్ 13, 2020 సాయంత్రం 5 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానళ్లలో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారమవుతుంది.

 Super Hit Movie Orey Bujjiga World Television Premiere In Zee Telugu Dec 13th-TeluguStop.com

నిడదవోలు కు చెందిన బుజ్జిగాడు (రాజ్ తరుణ్), కృష్ణవేణి (మాళవిక నాయర్) ఒకే రోజు ఇంట్లో నుంచి పారిపోతారు.వీళ్లిద్దరూ ఒకరికొకరు తెలీదు.కానీ, ఇంట్లో కుదిర్చిన పెళ్లిళ్ల నుంచి తప్పించుకోవడానికి పారిపోతారు.అయితే, ఇద్దరూ ఒకే రోజు పారిపోవడంతో ఇద్దరు కలిసి లేచిపోయారనే రూమర్ ఊరంతా వ్యాపిస్తుంది.

ఊళ్లో ఉన్న వీళ్ల కుటుంబ సభ్యులు శత్రువులుగా మారుతారు.మరోవైపు, బుజ్జిగాడు శ్రీను పేరుతో, కృష్ణవేణి స్వాతి పేరుతో ఒకరికొకరు పరిచయమవుతారు.

తన ప్రేయసి సృజన (హెబ్బా పటేల్)తో బుజ్జిగాడి ప్రేమ సక్సెస్ కాకపోవడానికి కారణమేమిటి? చివరకు బుజ్జిగాడు, కృష్ణవేణి ఎలా కలుసుకొన్నారు? కథ ఎన్ని మలుపులు తిరిగింది? అనేదే సినిమా.

ఈ సినిమాను కే.కే.రాధామోహన్ ప్రొడ్యూస్ చేయగా, విజయ్ కుమార్ కొండా డైరెక్ట్ చేసారు.అలాగే, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు

సూపర్‌ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌ ఒరేయ్ బుజ్జిగా సినిమా డిసెంబర్ 13, 2020 సాయంత్రం 5 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానళ్లలో.డోంట్‌ మిస్‌ ఇట్‌.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.

నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.

విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.

ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube