దంతాలు తెల్లగా ఉండాలంటే ఇవి తినాలి     2017-02-23   21:42:39  IST  Lakshmi P

చిరునవ్వు మనిషి అందాన్ని రెట్టంపు చేస్తుంది. కాని ఆ చిరునవ్వు అందంగా కనిపించాలంటే మాత్రం దంతాలు తెల్లగా ఉండాల్సిందే. సో, మన అందానికి అన్నిటికన్నా ముఖ్య విషయం, దంతాలు తెల్లగా ఉండటం. దంతాలని తెల్లగా మార్చుకోవడానికి మార్కేట్లో ఎన్ని కెమికల్ సాధనాలు దొరికినా, వాటికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండనే ఉంటుంది. అందుకే, దంతాలు తెల్లగా ఉండేందుకు సహకరించే నేచురల్ ఆహారాలు సూచిస్తున్నాం చూడండి.

* బ్రికోలి లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నోట్లో ఇంఫ్లేమేషన్ రాకుండా అడ్డుకోవడమే కాదు, ఎలాంటి బ్యాక్టీరియాని అయినా సరే తరిమికొడుతుంది. ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉండటంతో, బ్యాక్టీరియాతో పాటే వచ్చే మౌత్ కావిటి వంటి సమస్యలను అడ్టుకుంటుంది.

* టూత్ పేస్ట్ లో ఉండే మాలిక్ ఆసిడ్ లో కల్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కాని, ఆపిల్ లాంటి పండులో దొరికే మాలిక్ ఆసిడ్ లో కల్తీ కాని కెమికల్స్‌ కాని ఉండవు కదా. కాబట్టి, ఆపిల్ బాగా తినండి. ఇది సలైవా కూడా ఎక్కువగా ఉత్పత్తి అవడానికి కారణమయ్యి, మీ దంతాలను సాధ్యమైనంతవరకు శుభ్రంగా ఉంచుతుంది.

* విటమిన్ సీ ఎక్కువగా కలిగిన ఆరెంజ్ లాంటి ఫలాలు దంతాలకి కొంచెం ఇబ్బంది కలిగించేవే అయినా, వాటి తోలుతో దంతాలను శుభ్రం చేసుకుంటే మాత్రం మంచి ఫలితం కనిపిస్తుంది.

* క్యారట్ లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. దీనివల్ల సలైవా ఎక్కువగా ఉత్పత్తి జరిగి దంతాలు శుభ్రంగా ఉంటాయి.

* పైనాపిల్ లో బ్రొమోలెన్ అనే పదార్థం దంతాలను క్లీన్ చేస్తుంది. ఇది ఏ టూత్ పేస్ట్‌ కి తక్కువ కాదు.

* ఆపిల్ లో ఉన్నట్లే, స్ట్రాబెరిలో కూడా మాలిక్ ఆసిడ్ ఉంటుంది. అలాగే ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి కంటెంట్ కూడా దీనిలో లభ్యం అవుతుంది. కాబట్టి, మీ దంతాల అందానికి ఆరోగ్యానికి ఇదో మంచి ఫలం.

* ఇక చివరగా చెబుతున్నా, అతిముఖ్యమైన విషయం. దంతాల అందానికి, నీళ్ళు తాగే అలవాటుకి చాలా దగ్గరి సంబంధం ఉంది. నీళ్ళు ఎంత బాగా తాగితే, ఆసిడిక్ పదార్థాలు మన దంతాలని అంత తక్కువగా ఎటాక్ చేస్తాయి. కాబట్టి నీళ్ళు బాగా తాగండి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.